Venkatesh: వెంకీమామతో స్టెప్పులేయబోతున్న పొడుగుకాళ్ల సుందరి!

Share

Pooja Hegde: ఫాన్స్ అండ్ యాంటీఫాన్స్ అనే భేదం లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఫాలోయింగ్ వున్న ఏకైక హీరో విక్టరీ వెంకటేష్. ఇక ఆడవాళ్ళకైతే చెప్పనక్కర్లేదు, వెంకీ సినిమా బెనిఫిట్ షో చూస్తే గానీ వాళ్ళకి నిద్ర పట్టదు. అంతలా తెలుగునాట అతనిని ఆరాధిస్తారు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే, అప్పుడే సినీ ఇండీస్ట్రీకి వచ్చిన హీరోయిన్ కూడా వెంకీ సరసన నటించడానికి ఒకింత ఉత్సాహం చూపుతుంది. ఆ విషయంలో అతని వయసుని వారు అస్సలు పట్టించుకోరు.

ఇంతకీ ఆ సినిమా కథ ఏమిటి?

మన టాలీవుడ్ హీరోలు అడపా దడపా బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ వుంటారు. మెగాస్టార్ నుండి మెగా పవర్ స్టార్ వరకు ఏదో ఒక సినిమాలో అందరూ నటించినవారే. ఆ అనుభవం మన వెంకీ మామకు కూడా వుంది. దాదాపు 3 హిందీ సినిమాల్లో వెంక‌టేశ్ హీరోగా న‌టించాడు. అందులో ‘త‌క్‌దీర్ వాలా’ అనే సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక త‌ర్వాత ఆయ‌న పూర్తిగా తెలుగు సినీ పరిశ్రమకే ప‌రిమితం అయ్యారు. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మన సినిమాలకు మంచి మార్కెట్ వున్నందువలన వెంకీమామ కూడా అటువైపు దృష్టిని పెట్టినట్టు తెలుస్తోంది.

వెంకీమామతో స్టెప్పులేయబోతున్న హీరోయిన్ ఎవరు?

ఇక ఈ సినిమా వెంకీ సోలో సినిమా కాదని తెలుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్లు భాయ్ తో క‌లిసి న‌టించ‌డానికి ఈయన ఓకే చెప్పారట. ఇక ఈ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి అయినటువంటి పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇకపోతే, ఈవిడ వెంకీ మామతో స్టెప్పులేస్తుందా లేదంటే సల్మాన్ ఖాన్ తో జతకడుతుందా అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ విషయాన్ని ప్రస్తుతం సదరు మూవీ టీమ్ బయటపెట్టడానికి సిద్ధంగా లేదని సమాచారం.


Share

Recent Posts

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

1 hour ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

2 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

3 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

5 hours ago

పాన్ ఇండియా లెవెల్ లో నాగచైతన్యకి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..??

అక్కినేని కుటుంబం నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య సక్సెస్ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నాడు. "జోష్"తో హీరోగా ఎంట్రీ ఇచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ఒకపక్క సౌత్…

6 hours ago

మరోసారి తిరస్కరించిన అల్లు అర్జున్..!!

సినిమా రంగంలో టాప్ హీరోలకు యాడ్ రంగంలో భారీ ఆఫర్ లు వస్తూ ఉంటాయి అని అందరికీ తెలుసు. ఈ క్రమంలో చాలామంది హీరోలు ప్రముఖ కంపెనీలకు…

6 hours ago