F 3 : 2019లో వచ్చి పెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎఫ్ 2. ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి 100 కోట్ల వసూళ్ళు రాబట్టి భారీ హిట్ గా నిలిచి నిర్మాత దిల్ రాజుకి లాభాల పంట పండించింది. దాంతో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతోంది. విక్టరీ వెంకటేశ్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, మిల్కీ బ్యూటీ తమన్నా, యంగ్ బ్యూటీ మెహ్రీన్ జంటలుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి మరో సారీ పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయినట్టు సమాచారం.
కాగా ఇటీవల వెంకటేశ్ నటించిన నారప్ప సినిమా రిలీజై హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో వెంకీ ఎఫ్ 3 సినిమా రిలీజ్ కూడా మళ్ళీ సంక్రాంతి బరిలో ఉండబోతోందని వెల్లడించాడు. 2022 సంక్రాంతికి ఇప్పటికే మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాతో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ, ప్రభాస్ – పూజా హెగ్డేల రాధే శ్యాం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అయినా వెంకీ నమ్మకంగా ఎఫ్ 3ని సంక్రాంతి బరిలో దింపుతున్నట్టు ప్రకటించాడు. ఇదే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చి హాట్ టాపిక్‌గా మారింది.
F 3 : ఎఫ్ 3తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమా కథాంశం డబ్బు చుట్టూ తిరుగుతుందని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో వెంకీ – వరుణ్ పాత్రలకి సంబంధించి ఒక వార్త రివీల్ అయింది. ఇందులో వెంకటేశ్ పాత్రకి రేచీకటి ఉంటుందట. అలాగే వరుణ్ తేజ్ పాత్రకి నత్తి ఉంటుందట. ఈ రెండు పాత్రల స్వభావాలతో ఆధ్యతం ఆసక్తికరంగా కథ సాగుతుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు దర్శకుడు అనిల్ రావిపూడికి ఫ్లాప్ అంటే ఏంటో తెలీదు. మొదటి సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఎఫ్ 3తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నాడని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎఫ్ 3 ఎలాంటి విజయం అందుకుంటుందో.