Pawan kalyan : పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా అంటే ముందు అందరి మనసులో మొదలయ్యే ప్రశ్న .. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అని. ఖచ్చితంగా త్రివిక్రం ఫస్ట్ ఛాయిస్, ఆ తర్వాత డాలి, హరీష్ శంకర్..ఇలా అనుకుంటారు. కానీ పవర్ స్టార్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్ కి దర్శకుడు వేణు శ్రీరాం అనగానే కొంత షాక్ అయ్యారు. అందుకు కారణం పెద్ద హిట్ కొట్టిన దాఖలాలు లేకపోవడమే. దర్శకుడిగా వేణు శ్రీరాం టాలీవుడ్ లో ఓ పదేళ్ళ నుంచి ఉన్నాడు. అయితే ఈ దర్శకుడి నుంచి వచ్చింది కేవలం రెండు సినిమాలే.
వాటిలో ఒక సినిమా ‘ఓమై ఫ్రెండ్’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఇక రెండవ సినిమా నాని – సాయి పల్లవి లతో ఎం.సి.ఏ. ఈ యావరేజ్ టాక్ దగ్గరే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అవకాశం దక్కలేదు. వాస్తవంగా అల్లు అర్జున్ తో ఐకాన్ అన్న సినిమా ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరాం దర్శకుడిగా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. కానీ ఈ సినిమా మొదలవలేదు. ఇంతలోనే పవర్ స్టార్ ని డైరెక్ట్ చేసే ఊహించని ఛాన్స్.
Pawan kalyan : పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్..!
అమితాబ్ బచ్చన్ – తాప్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పింక్ సినిమాకి అఫీషియల్ రీమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. బాలీవుడ్ లో ‘పింక్’ సూపర్ హిట్. వంద కోట్లు వసూళ్ళు చేసింది. దాంతో వకీల్ సాబ్ సినిమాని వేణు శ్రీరాం ఎలా డీల్ చేస్తాడో అనుకున్నారు. కమర్షియల్ కథ కాదు కాబట్టి కాస్త అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆ అనుమానాలను వేణు శ్రీరాం టీజర్, ఇప్పటి వరకు రిలీజైన మూడు పాటల తో పటా పంచలు చేశాడు.
వేణు శ్రీరాం పవర్ స్టార్ ఇమేజ్ కి తగ్గట్టుగా చేసిన మార్పులకి ఫ్యాన్స్ సంబరపడుతున్నారట. పవన్ ని ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాడని ఒక అంచనాకి వచ్చేశారు. ఈ విషయమై దర్శకుడు శ్రీరామ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. వందలాది మీమ్స్ క్రియేట్ చేసి ఫేస్ బుక్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. పవర్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేశారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చూడాలి మరి అభిమానుల అంచనాలకి తగ్గట్టు దర్శకుడు వేణు శ్రీరాం ట్రీట్ మెంట్ ఎలాంటి సక్సస్ ని అందుకుంటుందో.