Vakeel saab : వకీల్ సాబ్ ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా. మూడేళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు యావత్ తెలుగు సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా వకీల్ సాబ్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఓ మై ఫ్రెండ్, ఎం.సి.ఏ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వేణు శ్రీరాం వకీల్ సాబ్ సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మాణంలో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.
ఏప్రిల్ 9న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వకీల్ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు వేణు శ్రీరాం ఎంతగా కష్ట పట్టాడో అన్నది బయట పడుతోంది. ఒక అభిమానిగా వకీల్ సాబ్ సినిమాని తెరకెక్కించినట్టు వేణు శ్రీరాం చెప్పుకొచ్చాడు. అంతేకాదు వకీల్ సాబ్ సినిమాతో వేణు శ్రీరాంలో ఉన్న టాలెంట్ కూడా ఇండస్రీ వర్గాలకి క్లియర్ గా అర్థమైంది. దీంతో గత రెండేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ ని మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు మొదలైనట్టు తెలుస్తోంది.
Vakeel saab : వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ రెడీ..?
ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతోంది. పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమాని చేయబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తర్వాత వేణు శ్రీరాం తో ఐకాన్ సినిమా చేసేందుకు రెడీ అన్నాడట అల్లు అర్జున్. ఇన్నాళ్ళు పెండింగ్ లో ఉన్న ఐకాన్ ప్రాజెక్ట్ కి పవర్ స్టార్ వకీల్ సాబ్ లైన్ క్లియర్ చేసిందని చెప్పుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో పింక్ సినిమాకి వకీల్ సాబ్ అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.