NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బల్దియా బద్ధకం ; హవ్వ హైద్రాబాద్ ఓటింగ్ లో ఇంత నిర్లక్షమా !!

బద్దకంతో హైద్రాబాద్ పోటీ పడుతోంది… ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడంలో భాగ్యనగరి తానె బాద్ షా అని ఫోజు కొడుతోంది… చిన్న సమస్యలకే౩యే పెద్ద లెక్చర్లు ఇచ్చే బాబులంతా ఓట్ హక్కుని వినియోగించుకునేందుకు ఇంటి నుంచి బయటకే కదలడం లేదు… ఆఖరికి అన్నింటా మేమె ముందుటామని చెప్పే హైద్రాబాద్ వాలా ఓట్ వెయ్యడంలో దారుణంగా ఓడిపోయాడు… ప్రశ్నించే ముని వీటి మీద సిరా వేయించుకోకుండా దాచుకున్నాడు…. ఫలితంగా మహా హైద్రాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అత్యల్పంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జాతీయ రికార్డు లు బద్దలు

ఇదేంటి … ఇప్పటివరకు హైద్రాబాద్ ప్రజలు ఓట్ వెయ్యలేదని చెప్పారుగా….!! మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టారు అంటారేమిటి అనుకోకండి.. మీరు చదువుతున్నది నిజమే.. ఓట్ వేయకపోవడంలోహైద్రాబాద్ జాతీయ రికార్డులు బద్దలు కొట్టింది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో మధ్యాహ్నం 1 గంటకు అంటే 6 గంటల తర్వాత హైద్రాబాద్ లోని కొన్ని పోలింగ్ బూత్లలో నమోదు అయినా ఓటింగ్ శాతం జాతీయ రికార్డు లను బద్దలు కొట్టింది. కొన్ని బూత్ లలో ఉన్న అధికారుల కంటే ఓటర్లు తక్కువ శాతం వచ్చినట్లు తెలుస్తోంది.

** ఒంటి గంట సమయానికి నమోదు అయినా అత్యల్ప పోలింగ్ (శాతంలో)

* కాంచన్ బాగ్ ; 2 . 13 , శాలిబండ ; 3 . 85 , అత్తాపూర్ ; 3 . 85 , రైన్ బజార్ ; 0 . 56 , బేగం బజార్ ; 3 . 85 , తలాబ్ చంచలం ; 0 . 74 , షేక్ పెట్ ; 2 . 62 , జియాగూడ, కార్వాన్ ; 3 . 85 , అమీర్ పెట్ ; 0 . 79 , సోమాజిగూడ ; 2 . 77 , ఆళ్వాన్ కాలనీ , సుభాష్ నగర్ ; 3 . 85 ,
(అత్యధికంగా గుడిమల్కాపూర్ లో 49 . 19 శాతం నమోదు అయ్యింది )

**సాయంత్రం 3 గంటల సమయానికి…

మాదాపూర్ ; 20 . 02 , చార్మినార్ 23 . 24 , మియాపూర్ ; 25 ; 43 , రాజేంద్రనగర్ 24 . 62 , హాఫిజ్ పేట 20 . 98 , సంతోష్ నగరు ; 17 . 54 , మలక్ పేట ; 14 . 88

** సాయంత్రం 3 గంటలకు సైతం 25 . 34 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయ్యింది.

పోలింగ్‌కు మరో మూడు గంటలు మాత్రమే సమయం ఉంది. దీంతో నగరంలో ఓటింగ్ శాతం కనీసం 40 శాతమైనా దాటుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బస్తీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటు వేసేందుకు జనం ముందుకొస్తున్నా.. జూబ్లీ హిల్స్ వంటి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఓటు వేయడానికి జనం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైనప్పటికీ.. చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా కనిపించింది. ఉదయం 9 గంటల వరకు 3.10 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 11 గంటలకు 8 . 9 శాతం, ఒంటి గంటకు 18 . 20 శాతంకు చేరుకుంది .
** పది గంటల తరువాత ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వస్తారని రాజకీయ పార్టీలు, అధికారులు భావించారు. కానీ గ్రేటర్ ఓటర్లు మాత్రం ఎప్పటిలాగే ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎక్కువమంది ఇంటి నుంచి బయటకు రావడానికి సైతం ఆసక్తి చూపలేదు.
** జూబ్లీ హిల్స్‌లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల కోసం సిబ్బంది వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ఎంతగా కోరినా.. ఓటర్లు మాత్రం వారిన విజ్ఞప్తిని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అయితే నగరంలో బస్తీలు ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల్లో మాత్రం జనం ఓటు వేసేందుకు క్యూ కడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లోనూ ఓటింగ్ పర్వాలేదనిపించేలా ఉంది. చదువుకున్నవారు ఓటింగ్ లో పాల్గునేందుకు ముందుకు రాకపోవడం విమర్శలకు దరి తీస్తోంది.
** జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం 2009లో 42.04 శాతంగా నమోదైన ఓటింగ్.. 2016లో 45.29 శాతంగా నమోదైంది. ఈసారి ఓటింగ్ శాతం 50 శాతానికి చేరుకునేలా చేయాలని చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. అయితే ఓటింగ్ సరళి చూస్తే 2016 ఎన్నికల కంటే ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

author avatar
Special Bureau

Related posts

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?