NewsOrbit
న్యూస్

Video Viral: ట్రైన్ లోకో పైలట్ సమయస్పూర్తి..! వృద్ధుడికి తృటిలో తప్పిన ప్రాణాపాయం..!!

Video Viral: ఓ వృద్ధుడు రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా రైలు వచ్చేసింది..రైల్వే స్టేషన్‌లో అందరూ ఒక్కసారిగా కేకలు వేశారు. ఆ వృద్ధుడు పట్టాలు దాటలేకపోయాడు, అతను రైలు ఇంజను కింద పడిపోయాడు. ఆ తరువాత ఆ వృద్దుడు క్షేమంగా ఉండటంతో అందరూ ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. లోకో పైలట్ ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో ఆ వృద్దుడికి ప్రాణాపాయం తప్పింది. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ లు లోకో పైలట్ కు హాట్సాఫ్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

Video Viral: A senior citizen narrowly escaped death at Mumbai railway station
Video Viral A senior citizen narrowly escaped death at Mumbai railway station

విషయంలోకి వెళితే…ముంబయిలోని కల్యాణ్ ఏరియా రైల్వే స్టేషన్ లో ఓ వృద్ధుడు రైలు పట్టాలు దాడుతుండగా ఫ్లాట్ ఫామ్ మీదకు రైలు వచ్చేసింది. రైల్వే స్టేషన్ లో ఉన్న ప్రయాణీకులు పట్టాలు దాటుతున్న వృద్ధుడిని చూసి కేకలు వేయడంతో లోకో పైలట్ వెంటనే స్పందించి ఎమర్జన్సీ బ్రేక్ వేశాడు. అప్పటికే ఆ వృద్ధుడు రైలు ఇంజన్ కింద పడిపోయాడు. వెంటనే రైల్వే సిబ్బంది, లోకో పైలట్ రైలు ఇంజన్ కింద పడిన వృద్ధుడిని నెమ్మదిగా బయటకు తీసి ఫ్లాట్ ఫారమ్ మీదకు చేర్చారు. వృద్ధుడు క్షేమంగా బయటపడటంతో అక్కడ ఉన్న వారంతా సంతోషం వ్యక్తం చేశారు. లోకో పైలట్ ను అభినందించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ ఘటనపై సెంట్రల్ రైల్వే జీఎం అలోక్ కన్సాల్ స్పందించారు. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ తో సహా సీపిడబ్ల్యుఐ (చీఫ్ పర్మినెంట్ వే ఇన్స్ పెక్టర్)లకు రూ.2వేల చొప్పున నగదు బహుమతిని ప్రకటించారు. సమయస్పూర్తిగా వ్యవహరించి వృద్ధుడిని కాపాడటంపై వారిని అభినందించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N