Video Viral: అబ్బో ఈ పిల్లి ధైర్యం మామూలుగా లేదుగా..! ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..!!

Share

Video Viral: సాధారణంగా పిల్లికి పిరికితనం ఉంటుందని, పులికి పౌరుషం ఉంటుందని అందరూ అనుకుంటారు. అదే మాదిరిగా సినిమాల్లోనూ పిల్లిని కాదు పులి అనే మాటలు వింటుంటాం. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే మనుషులు కనబడితేనే పిల్లి పారిపోతుంది. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఓ పెంపుడు పిల్లి విష సర్వాన్నే కొద్ది సేపు ఇంట్లోకి రాకుండా నిలువరించి హీరో అయ్యింది. ఈ ఆశక్తికర ఘటన ఒడిశాలోని భీమసాంగి ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పెంపుడు పిల్లి ధైర్యాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటూ ప్రశంసిస్తున్నారు.

Video Viral cat vs snake
Video Viral cat vs snake

విషయంలోకి వెళితే… భీమసాంగి ప్రాంతంలో నివాసం ఉండే సంపత్ కుమార్  అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి ఓ నాగుపాము వచ్చింది. పెరట్లోకి వస్తున్న ఆ విషసర్పాన్ని సంపత్ కుమార్ పెంపుడు పిల్లి (చిన్ను) చూసి వెంటనే ఆ పామును అడ్డుకుంది. పిల్లిపై దాడి చేసేందుకు ఆ నాగుపాము పడగ విప్పి తన ఉగ్రరూపం పిల్లికి చూపించింది. అయినప్పటికీ ఈ పిల్లి ఏ మాత్రం వెనుకంజ వేయకుండా దానికి ఎదురొడ్డి నిలిచింది. ఇంతలో అక్కడ ఉన్న ఓ కుక్క అరవడంతో సంపత్ కుమార్, అతని కుటుంబ సభ్యులు వచ్చి చూడగా పాము బుసలు కొడుతుండగా దాని ఎదురుగా తమ పెంపడు పిల్లి చిన్ను ఉండటాన్ని గమనించారు.

వెంటనే సంపత్ కుమార్ స్నేక్ వలంటీర్ కు సమాచారం అందించాడు. అయితే స్నేక్ వలంటీర్ వచ్చే వరకూ నాగుపామును ఎటూ కదలనివ్వకుండా పిల్లి అక్కడే కూర్చుంది. స్నేక్ వలంటీర్ వచ్చి పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం ఆ పామును సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలివేశాడు. అనంతరం సంపత్ కుమార్ తమ పెంపుడు పిల్లిని పాము ఏమైనా కాటు వేసిందేమోనని పరీక్షలు చేయించారు. ఎలాంటి కాటు పడలేదని తెలిసి సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంత ప్రజలు ఆ పెంపుడు పిల్లిని ఇది పిల్లి కాదు పులి అంటూ ప్రశంసిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4: అదరగొడుతున్న అభిజిత్ మైండ్ గేమ్… అఖిల్ ని కనిపెట్టేసినట్లే..??

sekhar

Job Updates : నిరుద్యోగులకు తీపికబురు అందించిన ఎన్‌టీ‌పీసీ..!!

bharani jella

మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!

sekhar