న్యూస్ వీడియోలు

Video Viral: పొలంలో పనులు చేస్తుండగా కాటేసిన నాగుపాము.. పామును చేతపట్టుకుని ఆ యువకుడు చేసిన పనికి అందరూ షాక్..

Share

Video Viral: సాధారణంగా ప్రజలు విష సర్పాలను చూస్తే భయపడిపోతారు. అవి కనబడితే భయంతో ఆమడదూరం పరుగు పెడతారు. నాగు పాము అయితే పగబడుతుందన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. అటువంటిది ఓ యువకుడు తనను కాటేసిన నాగుపామును చేత పట్టుకుని ఆసుపత్రికి వెళ్లడం చూపరులను ఆశ్చర్యానికిగురి చేసింది. ఈ ఘటన కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలో జరిగింది. పాము కాటేసిన వ్యక్తి ఆసుపత్రికి వెళితే ముందుగా వైద్యులు అడిగే ప్రశ్న ఏ పాము కాటేసింది అడుగుతారు. కట్ల పాము, నాగుపాము, కర్తపింజరి, జర్రిగొడ్డు ఇలా అనేక రకాల పాములు ఉంటాయి. ఏ పాము కాటేసిందో తెలిస్తే దాన్ని బట్టి వైద్యులు వైద్యం అందించే అవకాశం ఉంటుంది. వైద్యులు ఏ పాము కాటేసింది అని అడుగుతారు అనుకున్న ఆ యువకుడు తనను కాటేసిన పామును సజీవంగా పట్టుకుని మరీ ఆసుపత్రికి వెల్లడంతో వైద్యులు, సిబ్బంది హడలెత్తిపోయారు.

Video Viral: snake bite victim went hospital with alive snake
Video Viral: snake bite victim went hospital with alive snake

వివరాల్లకి వెళితే… కంప్లి తాలూకా ఉప్పారహళ్లి గ్రామానికి చెందిన కాడప్ప అనే యువకుడు పొలం పనులు నిర్వహిస్తుండగా నాగు పాము కాటేసింది. అయితే ఆ యువకుడు భయపడకుండా తనను కాటేసిన పామును సజీవంగా పట్టుకుని మెట్రి గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఎవ్వరూ లేకపోవడంతో స్నేహితుల సహాయంతో వెంటనే కుంప్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ ఆ యువకుడి చేతిలో పామును చూసి వైద్యులు, సిబ్బంది బెంబేలెత్తిపోయారు. భయపడుతూ ముందు బయటకు వెళ్లాలంటూ అతన్ని ఆదేశించారు.

Read More: Viral video: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే..!ఎందుకు..?ఎక్కడో..?ఈ వీడియో చూడండి..!!

ఆ తరువాత విషయం తెలుసుకుని కాడప్పకు ప్రధమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్ కు తరలించారు. కాటేసిన పామును ఆ యువకుడు చేత పట్టుకుని ఆసుపత్రికి వెళ్లడాన్ని సమీపంలో ఉన్న వారు మొబైల్ ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.


Share

Related posts

YS Viveka: వివేకా కేసులో దారుణ నిజాలు..! వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు..?

Srinivas Manem

భార్యతో సహా దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

somaraju sharma

California winery : భలే ఉద్యోగం.. 7 లక్షలు జీతం..!!

bharani jella