NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బతికున్న పురుగుల‌తో ఆమ్లెట్.. ఎలా త‌యారు చేస్తారో తెలుసా..?

మ‌నం తింటున్న‌ప్పుడు ఆహారంలో ఒక చిన్న పురుగు క‌నిపించింది అంటే ఏం చేస్తాం.. యాక్ తూ.. అంటూ ఉమ్మెస్తాం క‌దూ.. అలాగే ఆహారాన్ని మొత్తాన్ని తీసి చెత్త కుప్ప‌లో ప‌డేస్తాం. కానీ ఒక చోట అ పురుగులతో ఆమ్లెట్ వేసుకుంటారు. ఆ ఆమ్లెట్లు చ‌లికాలం వ‌చ్చిందంటే చాలు చాలా ఫేమ‌స్. లొట్ట‌లేసుకుని మ‌రీ తింటారు. అస‌లు పురుగుల‌తో ఆమ్లెట్ ఏంట‌ని అనుకుంటున్నారా.? పురుగుల‌తో ఎలా చేస్తార‌ని ఆలోచిస్తున్నారా..?

వివరాల్లోకి పోతే.. ఉత్తర వియత్నాంలోని హనోయిలోని స్పెష‌ల్ గా చేసే ఈ పురుగుల వంట‌కం గురించి తెలుసుకోవ‌ల‌సిందే. ఈ పురుగుల‌తో చేసిన ఈ వంట‌కాన్ని చూస్తే అచ్చం మ‌నం తినే ఎగ్ ఆమ్లెట్ లాగే క‌నిపిస్తుంది. ఉల్లిపాయాల‌ను ఎక్కువ‌గా వేసి త‌యారు చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. చూడ‌డానికి చ‌క్క‌గా ఆమ్లెట్ లాగా ఉంద‌ని నోట్లో పెట్టుకుంటే ఇగ అస‌లు విష‌యం తెలుస్తుంది. ఆ ఆమ్లెట్ ఎగ్ ది కాద‌ని.. అది పురుగుల‌తో చేసిన ఆమ్లెట్ అని..

అయితే ఈ పురుగుల ఆమ్లెట్ ను చా రుయి లేదా సాండ్ వామ్ ఆమ్లెట్ అని అంటారు.ఈ ఆమ్లెట్ చేయ‌డం చాలా తేలిక‌. మాములుగా చేసే ఆమ్లెట్ లాగే దీన్ని త‌యారు చేస్తార‌ని అనుకుంటే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్లే.. ఎగ్ ఆమ్లెట్ లాగే ఇందులో కోసిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ప‌చ్చి మిర్చీ వేస్తారు. అయితే పురుగుల నుంచి వాస‌న రాకుండా ఉండేందుకు ముందుగా వాటిని వేడి నీటీలో క‌డుగుతారు. త‌ర్వాత ఉప్పు, కారం బాగా క‌లుపుతారు.

త‌ర్వాత అందులో ఆ పురుగుల‌ను వేసి క‌లుపుతారు. నెక్ట్ ఒక పెంక‌మీద అర‌టి ఆకుల‌ను ఉంచి దానిపై వెన్న వేసి వేడి చేస్తారు. త‌ర్వాత పురుగుల మిశ్ర‌మాన్ని వేసి దానిపై మూత పెడ‌తారు. అలా చేసిని కొద్ది సేప‌టికి ఆ ఆమ్లెట్ రెడీ అయిపోయిన‌ట్లే.. దాన్ని ఇక తిన‌డ‌మే త‌రువాయి. ఈ పురుగుల ఆమ్లెట్ రుచి అదిరిపోతుంది అంటా.. నాన్ వెజ్ తిన్న‌ట్లే ఉంటుంది అని ప‌లువురు చెబుతున్నారు. దీనికి అక్క‌డ బ‌లే గిరాకి కూడా ఉంటుందంటా.

వియత్నాం స్ట్రీట్ ఫుడ్స్‌లో ఈ వంట‌కానికి స్పెష‌ల్ ప్లేస్ ఉంది.చలికాలంలో దీన్ని తినేందుకు ఎంతో మంది ఎగ‌బ‌డ‌తారు అంటే న‌మ్ముతారా..? అయితే ఈ పురుగులు బ‌య‌ట దొరికే పురుగులు మాత్రం కాదు. వీటిని ప్ర‌త్యేకంగా పెంచుతారంటా. ఇలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే యూట్యూబ్ లో దీనికి సంబంధించిన వీడియోలు ఉంటాయి ఒక లుక్ వేయండి.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?