vijay antony daughter: తమిళ నటుడు, బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తె మీరా (17) ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని చర్చి పార్క్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మీరా .. మంగళవారం (నేటి) వేకువజామున తన గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. ఆయితే ఆమె ఆత్మహత్యకు చదువుల ఒత్తిడే కారణమా, ఇంకేమా కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు.

విజయ్ కుటుంబం చెన్నైలోని డీడీకే రోడ్డులో నివాసం ఉంటుండగా, వారికి మీరా ఒక్కతే సంతానం. ఒక్కగానొక్క పాప ఆత్మహత్యకు పాల్పడటంతో విజయ్ ఆంటోని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మీరా మృతికి అసలు కారణాలు తెలియరాలేదు. ఇప్పటి వరపకూ విజయ్ ఆంటోని తన కూతురు మృతిపై స్పందించలేదు. కాగా విజయ్ ఆంటోని కూతురి మీరా మరణవార్త తెలుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ ఆయనకు ధైర్యం చెబుతున్నారు.
అయితే విజయ్ ఆంతోని గతంలో ఆత్మహత్య ఆలోచనల గురించి చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఆత్మహత్య ఎందుకు చేరుకుంటారు.. ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయ్ అనే విషయాలపై ఆయన మాట్లాడారు. ఎవరైనా నమ్మి మోసపోయినప్పుడు, చెప్పినట్లుగా, కమిట్మెంట్ ఇచ్చినట్లుగా పని చేయలేకపోయినప్పుడు, చిన్న పిల్లలకు అయితే చదువు విషయంలో వత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయని విజయ్ ఆంతోని గతంలో పేర్కొన్నారు. చిన్న పిల్లలను తల్లిదండ్రులు కాస్త ఫ్రీ గా వదిలివేయాలనీ, వారిపై ఒత్తిడి చేయకూడదని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు విజయ్ ఒక్కగానొక్క కుమార్తె ఆత్మహత్యకు పాల్పడటంతో తన కుమార్తె విషయంలో సాధారణ తండ్రిగానే వ్యవహరించారా.. ఆయన ఉపన్యాసం చెప్పినట్లుగా వ్యవహరించలేదా అన్న మాటలు వినబడుతున్నాయి.
PM Modi: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం .. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం .. స్వాగతించిన బీఆర్ఎస్