Vijay devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా కాదు నిర్మాతగా చాలా బిజీ

Share

Vijay devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ సినిమా చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సాలా క్రాస్ బ్రీడ్ అనే వెరైటీ ట్యాగ్ లైన్‌తో రూపొందుతోంది. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లో లైగర్ రిలీజ్ కానుంది. పాన్ ఇండియన్ స్థాయిలో 120 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపిస్తోంది.

vijay-devarakonda-is too busy as a producer
vijay-devarakonda-is too busy as a producer

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది చివరిలో లైగర్ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ మరొక వైపు నిర్మాతగాను చాలా బిజీగా ఉన్నాడు. సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన విజయ్ ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా మంచి ఆదరణను దక్కించుకుంది.

Vijay devarakonda : విజయ్ దేవరకొండ కరోనా పరిస్థితులు చక్కబడగానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడట.

కాగా ప్రస్తుతం ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ‘పుష్పక విమానం’ అనే సినిమాను నిర్మిస్తున్నాడు. దామోదర అనే యంగ్ డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో ఉండగా.. మూడవ సినిమాను నిర్మించడానికి విజయ్ దేవరకొండ సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా తోనూ యంగ్ డైరెక్టర్ పృథ్వీసేన దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అందరూ కొత్తవారే నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. కరోనా పరిస్థితులు చక్కబడగానే ప్రాజెక్ట్ మొదలవనుందని తెలుస్తోంది.


Share

Related posts

బిగ్ బాస్ 4: సహనం కోల్పోయిన అఖిల్..!!

sekhar

కృష్ణానదికి పెరుగుతున్న వరద…ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Special Bureau

ఆ బాలీవుడ్ సినిమా కోసం స్టార్ హీరోయిన్స్ మధ్య పోరు మొదలైందట ..?

GRK