విజయ్ దేవరకొండ హీరో గా మొదటి సినిమా పెళ్ళి చూపులు. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. గీత గోవిందం లాంటి క్లాస్ సినిమాలు చేస్తూనే అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేయడం టాలీవుడ్ లో విజయ్ కే సాధ్యమైంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఒక్క సినిమాతో విజయ్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. వివాదాలు చెలరేగినప్పటికి ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామీలీ ఆడియన్స్ అందరికీ విపరీతంగా నచ్చింది. చెప్పాలంటే పదేళ్ళ కి సరిపడా పాపులారిటీ అండ్ క్రేజ్ ని తీసుకు వచ్చింది అర్జున్ రెడ్డి. డియర్ కామ్రేడ్, టాక్సీవాలా, వరల్డ్ ఫేమస్ లవర్ ఇలా హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ తో బౌన్స్ బ్యాక్ అయిన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా పూరి, ఛార్మీ కలిసి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత ఇంద్రగంటి మోహన కృష్ణ లేదా అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ ఇమేజ్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ తో విజయ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.
కాని విజయ్ తన నెక్స్ట్ సినిమాని సుకుమార్ దర్శకత్వంలో అది కూడా ఒక కొత్త ప్రొడ్యూసర్ తో అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. వాస్తవంగా విజయ్ దేవరకొండ – సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఊహించలేదు. ఏదేమైనా సుకుమార్ – విజయ్ కాంబోలో రాబోయో సినిమా పాన్ ఇండియన్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
అయితే ఈ సినిమాకి సుకుమార్ రెమ్యునరేషన్ చాలా ఎక్కువగా అందుకోనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకి విజయ్ స్నేహితుడు కేదర్ నిర్మాతగా వహిస్తుండగా సుకుమార్ కు కేవలం అడ్వాన్స్ గా 10 కోట్లు ఇచ్చినట్టు సమాచారం. ఇఇది నిజమో లేదో తెలియదు గాని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ సినిమా 2022లో మొదలవబోతుంది.