LIGER: టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా వరుస ప్లాపులలో రౌడీ విజయ్ ఉండటంతో పూరి జగన్నాథ్ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తాడని భావిస్తున్నారు. పూరి జగన్నాథ్ అంతకుముందు సినిమా రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ .. రామ్ కి మంచి బ్రేక్ అవడంతో ఇప్పుడు ఇదే తరహాలో.. విజయ్ దేవరకొండ కి కూడా లైఫ్ ఇస్తాడని భావిస్తున్నారు. పైగా సినిమాల్లో రమ్యకృష్ణ ఇంకా చాలామంది టాప్ నటీనటులు నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇండస్ట్రీ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తున్నా కానీ ఈ సినిమా గురించి ఎటువంటి వార్త లేదు. ఇటువంటి తరుణంలో త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ పోస్టర్ స్టిల్ ఒకటి రిలీజ్ చేయడానికి పూరి ప్లాన్ వేసినట్లు లేటెస్ట్ టాక్. గతంలో ఈ సినిమా ఓ టిటి లో రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆ టైంలో విజయ్ దేవరకొండ కచ్చితంగా సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుందని ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ఏ రోజుల్లో సినిమా డేట్ ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అవటం తో విజయ్ దేవరకొండ అభిమానులు.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా లెవెల్ లో ఎంట్రీ ఇస్తూ ఉండటంతో “లైగర్” ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఒక అర్జున్ రెడ్డి లాంటి ఈ సినిమాతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ వరకు.. విజయ్ దేవరకొండ క్రియేట్ చేసుకోవడంతో ఈ సినిమాతో ఎటువంటి అద్భుతాలు సృష్టిస్తడో అన్నది ఆసక్తికరంగా మారింది.