అబ్బో రౌడీ రేంజ్ బాగా పెరిగిపోయిందా?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఆనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు. ఇప్పుడంటే విజయ్ దేవరకొండ కు స్టార్ స్టేటస్ వచ్చింది కానీ మొదట్లో సహాయక పాత్రలకే పరిమితమయ్యాడు. ఒక్కో ఇటుక కట్టినట్లు ఒక్కో సినిమాతో ఎదుగుతూ వచ్చాడు.

 

vijay deverakonda movie with sukumar
vijay deverakonda movie with sukumar

 

నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత పెళ్లి చూపులు తన కెరీర్ ను టర్న్ తిప్పింది. ఇక ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సెన్సేషన్. ఆ సినిమాలో విజయ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత అద్భుతంగా నటించాడు. గీత గోవిందం వంటి క్లాస్ సినిమాతో కూడా మెప్పించగలనని నిరూపించాడు విజయ్. టాక్సీ వాలా విజయంతో తన రేంజ్ ను పెంచుకున్నాడు. అయితే వరసగా డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అయినా కానీ విజయ్ కెరీర్ కు ఎటువంటి ఢోకా లేదు. నిజం చెప్పాలంటే తన రేంజ్ ఇంకా పెరిగింది. వరస ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు విజయ్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ చిత్రాన్ని చేస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ ముంబైలో 40 రోజుల పాటు సాగింది. ఆ తర్వాత కరోనా కారణంగా బ్రేకులు పడింది. ఫైటర్ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇక అధికారిక సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ సినిమా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తో ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా 2022లో పట్టాలెక్కుతుందని అధికారికంగా ప్రకటించారు. కేదార్ సెలగంశెట్టి ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగుతున్నాడు. నిర్మాత పుట్టినరోజు సందర్భంగా సినిమా అనౌన్స్మెంట్ జరిగింది. ఇది కూడా ప్యాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమాను మొదలుపెట్టే ప్లాన్స్ లో ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక విజయ్ దేవరకొండతో సినిమాను పట్టాలెక్కిస్తాడు సుకుమార్.