Vijay Deverakonda: విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఆగస్టు 25న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ ఎమ్ఎమ్ఏ ఫైటర్ (MMA Fighter)గా అలరించనున్నాడు. ఈ సినిమాని పూరి కనెక్ట్స్-ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా మరొక సినిమా చేయడానికి పూరి సిద్ధమయ్యాడు.
Vijay Deverakonda: జనగణమన
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
2016లో పూరి జగన్నాథ్, మహేష్ కలిసి జనగణమన సినిమా చేస్తారని అధికారికంగా ప్రకటించారు కానీ తెలియని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే ఇటీవల ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో విజయ్‌ని హీరోగా తీసుకోవాలని పూరి అనుకున్నాడు. అందుకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ పూజా హెగ్డే రౌడీ స్టార్‌తో జతకట్టనుంది. మిలటరీ యాక్షన్ సినిమాగా వస్తున్న జనగణమన 2023 ఆగస్టు 3న రిలీజ్ చేయాలని మూవీ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి, ఛార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
మరొక మూవీ కూడా!
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విజయ్ దేవరకొండ ఇప్పుడు టాలీవుడ్లో సూపర్ డిమాండ్ ఉన్న హీరో అని చెప్పవచ్చు. ప్రస్తుతం అతనితో స్టార్ డైరెక్టర్స్ సైతం సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. కానీ విజయ్ మాత్రం వారందరినీ కాదని జనగణమనతో పాటు పూరి జగన్నాథ్ తో మరొక సినిమా తీసేందుకు కూడా సిద్ధమైనట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ ముచ్చటగా మూడో మూవీ కూడా ప్లాన్ చేశారని సినీ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే లైగర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి రూమర్స్ ని కావాలనే క్రియేట్ చేస్తున్నారని మరోవైపు వార్తలు వస్తున్నాయి. ఇలా చేయడం వల్ల విజయ్ దేవరకొండ, లైగర్ సినిమా రెండూ వార్తల్లో నిలుస్తాయని.. అప్పుడు ఫ్రీ ప్రమోషన్ దొరుకుతుందనే ఉద్దేశంతోనే ఇలాంటి రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని అంటున్నారు. అయితే విజయ్ పూరితో కలిసి హ్యాట్రిక్ మూవీ చేస్తున్నాడా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.