Vijay : విజయ్ .. కోలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. టాలీవుడ్ లో ప్రభాస్ కి ఎంతటి క్రేజ్ ఉందో కోలీవుడ్ లో విజయ్ కి అంతటి క్రేజ్ వచ్చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోటీ అన్నట్టుగా విజయ్ సినిమాలను ఎంచుకుంటున్నాడు. అంతేకాదు టాలీవుడ్ లో ప్రభాస్ ఎలా అయితే డైరెక్టర్స్ ని ఎన్నుకుంటున్నాడో కోలీవుడ్ లో విజయ్ కూడా అలాగే ఖచ్చితంగా తనకి బ్లాక్ బస్టర్ ఇచ్చే దర్శకుడినే ఎన్నుకుంటున్నాడు. ఇప్పటికే వరసగా భారీ సక్సస్ లను అందుకుంటున్న విజయ్ రీసెంట్ గా మాస్టర్ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నాడు.
సంక్రాంతి రేస్ లో దిగిన ఈ సినిమా వసూళ్ళ సునామీని సృష్ఠించింది. తమిళం తో పాటు తెలుగు .. హిందీ భాషల్లోనూ రిలీజ్ అయిన విజయ్ మాస్టర్ అంచనాలను మించి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే ఈ సినిమా దాదాపు 200 కోట్ల బిజినెస్ చేసిందంటే విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ కి ఎంతటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్ కోలీవుడ్ లో మరింతగా పెరింగింది. ఈ క్రమంలోనే లోక నాయకుడు కమల్ హాసన్ తో ప్రస్తుతం విక్రం అన్న సినిమా చేస్తున్నాడు.
Vijay : విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ కోలీవుడ్ సినిమా ..?
కాగా మరొకసారి విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ గా పలువురు స్టార్స్ తో సినిమాలు చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారని సమాచారం. లోకేశ్ కనగరాజ్ కార్తీ తో ఖైదీ.. తీసి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అలాగే విజయ్ కి మాస్టర్ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. అయితే ఎప్పటి నుంచో మైత్రీ మూవీ వారు కోలీవుడ్ లో సినిమా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అది ఇపుడు విజయ్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. చూడాలి మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!