విజయ్ ని కోలీవుడ్ లో ఇక ఇప్పట్లో ఆపే సత్తా ఏ హీరోకి లేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. అందుకు కారణం రీసెంట్ గా రిలీజైన ‘మాస్టర్’ సినిమా. గత కొంతకాలంగా వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ టాప్ ప్లేస్ లోకి చేరిన vijay మాస్టర్స్ సినిమాతో మరో లెవల్ కి చేరాడు. maaster సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ సాధించి సక్సస్ ఫుల్ గా థియేటర్స్ లో సందడి చేస్తోంది మాస్టర్ సినిమా. కేవలం ఇండియాలోనే కాక విదేశాలలోనూ సత్తా చాటుతోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజన్ దర్శకత్వంలో తలపతి విజయ్ మాళవిక మోహన్ జంటగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన మాస్టర్ సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ అయింది. తమిళం తో పాటు హిందీ తెలుగులో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఒక్క రోజు గ్యాప్ తో మూడు భాషల్లో రిలీజ్ చేశారు. వరసగా సూపర్ హిట్స్ అందుకుంటూ కోలీవుడ్ లో సూపర్ ఫాం లో vijay నటించిన మాస్టర్ భారీ అంచనాల మధ్య రిలీజై హిట్ సాధించింది. విజయ్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.
మిగతా భాషల కంటే కోలీవుడ్ లో ఈ సినిమా భారీ స్థాయిలో వసూళ్ళు రాబడుతోంది. master సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ ని దక్కించుకున్న విజయ్ ఫ్యాన్స్ కి సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పాడు. vijay master సినిమా త్వరలోనే ఓటీటీ ద్వారా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో విజయ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. ఆ డేట్ కి ఓటీటీలో రిలీజై మరింతగా వసూళ్ళు సాధిస్తుందని ధీమాగా ఉన్నారు మేకర్స్. కాగా ఫిబ్రవరి 12 నుండి అమెజాన్ ప్రైమ్ లో vijay master సినిమా స్ట్రీమ్ కాబోతున్నట్టు ప్రకటించారు. 13, 14 వీకెండ్ కావడం తో పాటు.. ప్రేమికుల దినోత్సవం కూడా రావడం మాస్టర్ ఓటీటీ రిలీజ్ కి బాగా కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. అందుకే ఈ డేట్ ను ఫిక్స్ చేశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?