Vijay Maste Movie .. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ఈ సినిమా గురించే ప్రస్తుతం సౌత్ సినిమా ఇండస్ట్రీ మొత్తం హాట్ హాట్ గా చర్చించుకుంటోంది. కార్తీ తో ‘ఖైదీ’ సినిమాని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్టర్ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ తర్వాత భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీవుతోంది విజయ్ మాస్టర్ మూవీ. వాస్తవంగా మాస్టర్ సినిమా కి ఓటీటీ నుంచి భారీ మొత్తం లో ఆఫర్ వచ్చినా కూడా విజయ్ కాంప్రమైజ్ కాలేదు.
ఎంత లేటయినా మాస్టర్ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక మాస్టర్ మూవీ రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ అయిందని కోలీవుడ్ మీడియాలో వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత క్రేజ్ ఉన్న హీరో విజయ్ అని తెలిసిందే. అయితే తాజా మాస్టర్ మూవీ మీద మాత్రం ఓవరాల్ గా క్రేజ్ నెలకొంది. ఇక విజయ్ గత కొంతకాలంగా వరసగా భారీ సక్సస్ లను అందుకుంటూ ఊహించని రేంజ్ లో తన మార్కెట్ ని పెంచుకున్నాడు. అంతేకాక దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మీద కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది.
అయితే మరికొన్ని గంటల్లో థియేటర్స్ లోకి రాబోతున్న విజయ్ మాస్టర్ మూవీ మీద అభిమానుల్లో ఇండస్ట్రీ వర్గాలలో.. మాస్టర్ మూవీ ఇండస్ట్రీ హిట్ పక్కా అన్న మాట వినిపిస్తోంది. విజయ్ గత చిత్రాల రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. ఇక లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో రాబోతున్న మాస్టర్ సెన్షేషనల్ హిట్ అవుతుందని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే మాస్టర్ ట్రైలర్ స్కై రేంజ్ లో అంచనాలని పెంచేసింది. కాగా ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో జనవరి 13న విడుదల కాబోతుండగా.. హిందీలో జనవరి 14న విడుదల కానుంది.