సినీ యాక్టర్స్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ప్రేక్షకులలో ఎప్పటికీ తగ్గదు. అందుకే సెలబ్రిటీల టాక్ షోలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే బాలీవుడ్లో అన్ని టాక్ షోల కంటే కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ సూపర్ పాపులర్ అయ్యింది. ఈ షో ఎప్పటి నుంచో నడుస్తోంది. ఆల్రెడీ 6 సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు 7వ సీజన్ కూడా మొదలైపోయింది. ఫస్ట్ ఎపిసోడ్లో రణవీర్ సింగ్, అలియా భట్ గెస్ట్లుగా వచ్చారు. రెండో ఎపిసోడ్లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు సారా అలీ ఖాన్, జాన్వీ కపూర్ వచ్చి సందడి చేశారు. ఈ కుర్ర హీరోయిన్లు షోలో చాలా విషయాలను పంచుకున్నారు. కరణ్ జోహార్ కూడా ఈ క్యూట్ యాక్టర్ల గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలు బయట పెట్టాడు. అయితే ఈ ఎపిసోడ్లో విజయ్ దేవరకొండతో డేటింగ్ గురించి మాట్లాడినప్పుడే హీరోయిన్ రష్మిక టాపిక్ తేవడం హైలెట్ అయింది.
ఆ అన్నదమ్ములతో డేటింగ్
కరణ్ జోహార్ సారా, జాన్వీకపూర్లను ఉద్దేశిస్తూ… “గతంలో మీరు ఇద్దరు అన్నదమ్ములతో డేటింగ్ చేశారు కదా? అది నాకు గుర్తుంది. నిజానికి వారిద్దరూ మా బిల్డింగ్‌లోనే ఉండేవారు” అని అన్నాడు. ఇది ఊహించని సారా, జాన్వీ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. గతంలో వీర్ పహారియా, శిఖర్ పహారియా అనే ఇద్దరు అన్నదమ్ములతో సారా, జాన్వీ నిజంగానే డేటింగ్ చేసారు. ఈ జంటలు ముంబై వీధుల్లో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట బీభత్సంగా వైరల్ అయ్యాయి. ఆ తరువాత వీర్‌తో బ్రేకప్ అయిందని సారా ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది.
విజయ్ దేవరకొండ, రష్మిక
ఈ డేటింగ్ ప్రస్తావన రావడంతో.. “మళ్లీ మీరు డేటింగ్‌కి వెళ్లాలి అనుకుంటే, ఎవరితో వెళ్తారు” అని కరణ్ సరదాగా అడిగాడు. ఈ ప్రశ్నకి సారా విజయ్ దేవరకొండ పేరు చెప్పింది. అంతకు ముందు సీజన్లో జాన్వి కూడా విజయ్ దేవరకొండతోనే డేటింగ్ చేస్తానని చెప్పింది. దీంతో కరణ్ జోహార్ తో పాటు ప్రేక్షకులు అవాక్కయ్యారు. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల టాపిక్ గురించి రాపిడ్ ఫైర్ జరుతున్నప్పుడు సారా, జాన్వి విజయ్ దేవరకొండతో పాటు రష్మిక పేరును తీసుకు వచ్చారు. వీరిద్దరి మధ్య ఏదో ఉన్నట్లుగా వారు మాట్లాడారు. అలానే రష్మిక, విజయ్ డేటింగ్ చేస్తునట్లు హింట్ ఇచ్చారు. దీంతో వారి మధ్య నిజంగా ఏదైనా ఉందా అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!