Vijay: తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. విజయ్ లేటెస్ట్ గా నటించిన చిత్రం వారసుడు ఈ సంక్రాంతి బరిలోకి దిగనుంది.. ఓవైపు విజయ్ వారసుడు సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో విజయ్ విడాకుల వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.. విజయ్ సంగీత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారం తో కి పెళ్లి చేసుకున్నారు.. అయితే వీళ్ళ విడాకులు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దానిపై విజయ్ రియాక్షన్ అదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

1997 విజయ్ సంగీత కి పెళ్లి అయింది. అంటే పెళ్లయి 23 ఏళ్ళు అయింది. వాళ్ళు ఇద్దరు పిల్లలు. రేపో మాపో వాళ్ళ కొడుకు హీరోగా ఎంట్రీ ఇస్తారని టాక్. ఐతే ఉన్నట్టుండి నిన్న వికీపీడియా పేజీలో కొన్ని మార్పులు జరిగాయి. విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చాడని.. మరో హీరోయిన్ తో ఉంటున్నట్లు ఆ పేజీలో రాశారు.. దాంతో ఆ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఆ విషయాన్ని గంటలోపే మళ్ళీ మార్చారు. అయితే ఇదంతా కొందరు ఆకతాయిల పని తేలింది. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ కి, అజిత్ ఫాన్స్ కి పచ్చగడ్డి వేస్తె భగ్గుమనేలా ఉంది.. అయితే ఫ్యాన్స్ ఎవరైనా ఈ పని చేసుండచ్చని అంతా అనుకున్నారు.. మరోవైపు విజయ్ భార్య సంగీత ప్రస్తుతం ఇండియాలో లేదు. పిల్లలతో కలిసి ఆమె విదేశాల్లో వెకేషన్ కి వెళ్లారట. న్యూ ఇయర్, క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కి వెళ్లడంతో జనం సులువుగా నమ్ముతారని ఈ ప్రచారం క్రియేట్ చేశారని అంటున్నారు. మరోవైపు విజయవాడలో సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండడంతో వారితో పాటు ఫారిన్ ట్రిప్ వెళ్లలేదట.. మొత్తానికి కొంత మంది ఆకతాయిలు విజయ్ విడాకులు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇది ఫేక్ న్యూస్.. విజయ్ ఆయన భార్య కలిసి ఉంటున్నారు అనేదే నిజం.. ఇప్పుడు అది నిజమని నిరూపించడానికి విజయ్ ఫారెన్ వెళ్లాడట ఇక రేపో మాపో సంగీత, సంజయ్ దివ్య లతో ఒక పిక్ షేర్ చేయనున్నాడట ప్రస్తుతం వాళ్లు అమెరికాలో ఉన్నారట ఇక విజయ్ అక్కడికి చేరుకొని తన ఫ్యామిలీతో కలిసి ఒక పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి విడాకుల న్యూస్ కి చెక్ పెట్టనున్నారని తాజా సమాచారం..