Vijay setupathi : ఇండస్ట్రీలోకి రావాలనుకున్నవాళ్ళు కొన్ని సందర్భాలలో ఎన్నో అవస్థలు పడి పెద్ద స్థాయికి చేరుకుంటారు. అయితే ఎలాంటి స్థాయికి వచ్చినా కూడా గతాన్ని మర్చిపోకుండా..నేలమీదే కాళ్లున్నాయని నిజంలో జీవించేవారు కూడా చాలామంది ఉన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం అతి కొద్దిమందిలోనే ఉంటుంది. అలాంటి వారిలో ప్రస్తుతం పాన్ ఇండుయన్ రేంజ్ లో క్రేజ్ ఉన్న విలక్షణ నటుడు విజయ సేతుపతి కూడా ఉన్నారు. ఆయన రేంజ్ ఇప్పుడు అసాధారణంగా మారిపోయింది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఆయనకి వస్తున్న అవకాశాలు అన్నీ ఒప్పుకునే సమయం లేనంత బిజీగా ఉన్నారు.
తమిళంలో హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి కొన్ని సినిమాలలో కీలక పాత్రలు వచ్చినా చేస్తున్నాడు. తెలుగులో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో కీలక పాత్ర పోషించారు. ఆ పాత్ర మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమనులను ఎంతగానో ఆకట్టుంది. దాంతో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన డెబ్యూ సినిమా ఉప్పెనలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు తెలుగులో పలు బడా నిర్మాణ సంస్థలు విజయ్ సేతుపతికి అవకాశాలివ్వడానికి రెడీగా ఉన్నాయి.
Vijay setupathi : మొదటిసారి బుల్లితెర మీద హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
అయితే దాదాపు రెండేళ్ళ వరకు ఆయన డైరీ ఖాళీ లేదు. అంతగా సినిమాలు కమిటయి ఉన్నారు. కాగా ఇంతకముందు ఒప్పుకున్న ఓ షో త్వరలో ప్రారంభం కాబోతుంది. మొదటిసారి బుల్లితెర మీద హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో భాగంగా విజయ్ సేతుపతి తాను చదువకునే రోజుల్లో సాయంత్రం ఫ్యామిలీ కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కొన్నాళ్ళు పని చేశాడట. రాత్రి 7 గంటల నుండి రాత్రి 12.30 వరకు పని చేసేవాడిని అని.. అక్కడే రాత్రి భోజనం చేసేవాడిని తాజాగా వెల్లడించారు. యజమాని ఆయనకు భోజనంతో పెట్టు 750 రూపాయల జీతం ఇచ్చారట. ఆ తర్వాత మరి కొన్నాళ్లు టెలిఫోన్ బూత్ లో పని చేశానని చెప్పుకొచ్చారు.