విజయవాడలోని కనకదుర్గ ఫ్లైఓవర్ మొదటి టెస్ట్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇది విజయవంతమవడంతో ఈరోజు నుండి రెండో టెస్ట్ రన్ ను నిర్వహించనున్నారు. ఈ టెస్ట్ రన్ లో ఫ్లైఓవర్ భారీ వాహనాలను, భారీ లోడ్ తో వచ్చే ట్రక్కులను ఫ్లైఓవర్ పై పరుగులు తీయించనున్నారు.
ఫ్లైఓవర్ సామర్ధ్యాన్ని దీని ద్వారా పరీక్షించనున్నారు. అంతే కాకుండా ఫ్లైఓవర్ మలుపులు తిరిగి ఉండడం, పక్కనే కృష్ణ నది ఉండడంతో ఎంత వేగంతో వెళ్లాలో వంటివి కూడా నిర్ణయించనున్నారు. దీంతో పాటు మరికొన్ని నియమనిబంధనలను రూపొందించనున్నారు. ట్రయిల్ రన్, లోడ్ టెస్టుల కారణంగా ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఈ ఫ్లైఓవర్ కు అదనపు సొబగులు అద్ది త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పక్కనే కృష్ణ నది, మలుపులు తిరిగి ఉన్న ఈ ఫ్లైఓవర్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?