మిసెస్ ప్లానెట్ విజయవాడ శివ నాగమల్లిక

Share

అందాల పోటీలో ఏపిలోని విజయవాడకు అరుదైన ఘనత దక్కింది. మిసెస్ ప్లానెట్ విజయవాడ మహిళ దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన మిసెస్ ప్లానెట్ అందాల పోటీల్లో విజయవాడకు చెందిన బిల్లుపాటి శివ నాగ మల్లిక విజేతగా నిలిచారు. బర్లాస్ సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలను బల్గేరియా దేశంలో ఈ నెల 6 నుండి 15వ తేదీ వరకూ జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న విజయవాడ ఆటోనగర్ కు చెందిన బిల్లుపాటి నాగమల్లిక వివాహితుల విభాగంలో 60 మంది ఇతర దేశాల వివాహితులతో ఏడు రౌండ్ లలో తలపడి మిసెస్ ప్లానెట్ టైటిల్ గెలుచుకుని ప్రపంచ అందాల పోటీల్లో తెలుగు వారి ఖ్యాతిని మరో సారి చాటిచెప్పింది.

 

నాగమల్లిక గతంలో 2019లో మిసెస్ అమరావతి, 2020లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021లో మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. ఈ ఏడాది మిసెస్ ప్లానెట్ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. నాగమల్లిక  ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె భర్త జితేంద్ర వ్యాపారవేత్తగా స్ధిరపడ్డారు. వీరికి ఆరవ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నారు. విజయవాడ లాంటి నగరం నుండి వెళ్లి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం ఆనందంగా ఉందని మల్లిక పేర్కొన్నారు. తన విజయంలో కుటుంబ సభ్యులు, భర్త జితేంద్ర ప్రోత్సాహం ఉన్నాయని తెలిపారు.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

26 mins ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

1 hour ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

3 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

4 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

4 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

5 hours ago