NewsOrbit
న్యూస్

తనను అవమానపరిచిన రాజుగారికి లాస్ట్ అండ్ ఫైనల్ జలక్ ఇవ్వనున్న సాయిరెడ్డి

నర్సాపురం వైసీపీ ఎంపి రఘురామకృష్ణం రాజు తీరు చూస్తుంటే తనకు షోకాజ్ ఇచ్చిన సొంత పార్టీపైనే రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది.ముఖ్యంగా తనకు షోకాజ్ నోటీస్ ఇచ్చిన వైసిపి అగ్రనేత విజయసాయిరెడ్డిని ఎంపీ టార్గెట్ చేశారు.విజయసాయిరెడ్డి తనకు రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణం రాజు పంపారు.

 

లేఖ అందినట్లుగా అ‍యనకు ఎన్నికల సంఘం ఈమెయిల్ లో సమాధానం ఇచ్చింది కూడా. వైసీపీలో అసలు క్రమశిక్షణ సంఘం లేదని.. దానికి ఎన్నికల సంఘం గుర్తింపు ఉందా అని ప్రశ్నిస్తూ .విజయసాయిరెడ్డి లేఖ వ్యవహారం పరిశీలించాలంటూ ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి పంపడం చర్చనీయాంశమైంది. ఈ ఎత్తుగడ ఏమిటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  దీంతో విజయసాయిరెడ్డి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని, ఇక ఉపేక్షించడం అనవసరం వెనువెంటనే రఘురామకృష్ణంరాజును పార్టీ నుంచి సస్పెండ్ చేయడం మంచిదని ఆయన పార్టీ అధినేత జగన్ కి కూడా చెప్పేశారని టాక్.అతి త్వరలోనే ఎంపి రఘురామ కృష్ణంరాజుకు వైసిపి గుడ్ బై చెప్పగలదంటున్నారు.




కొంతకాలంగా సొంత పార్టీ వైసీపీపై నిరసన గళం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై వైసీపీ నాయకత్వం ఇటీవలే షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని అది చూశాక చర్యలు ఉంటాయని తెలిపింది.

తాజాగా ఈ నోటీసుపై ఎంపీ రఘురామకృష్ణం రాజు స్పందించారు. వైసీపీ నుంచి తనకు నోటీసు వచ్చిందన్నారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పార్టీ తరుఫున నోటీసులు జారీ చేశారని.. వైసీపీ ప్రాంతీయ పార్టీ అని.. దానికి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని.. విజయసాయిరెడ్డి పేరుతో నోటీసులు ఎలా పంపిస్తారని విమర్శించారు.

పార్టీ పంపిన షోకాజ్ నోటీసు నేపథ్యంలో రఘురామకృష్ణం రాజు తాజాగా విజయసాయిరెడ్డికి పలు ప్రశ్నలు సంధిస్తూ ప్రతి లేఖ రాశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నానంటూ సంజాయిషీకి మీరెలా లేఖ పంపుతారని ’ లేఖలో రఘురామ ప్రశ్నించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం.. మెజారిటీ సభ్యులు నాపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారా? అలా చేస్తే ఆ మినిట్స్ ప్రతిని తనకు పంపాలని లేఖలో డిమాండ్ చేశారు.

మీరు పంపిన లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని.. లెటర్ హెడ్ పై పేర్కొన్న పార్టీ పేరే తప్పు అని రఘురామకృష్ణం రాజు లేఖలో దుయ్యబట్టారు.  తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరుఫున గెలిచానని.. వైసీపీ పేరు మారిందా అంటూ ప్రశ్నించారు.  నోటీసుకు చట్టబద్ధత లేదని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడే పంపాలని.. ప్రధాన కార్యదర్శి ఎలా సంజాయిషీ కోరుతారని లేఖలో ప్రశ్నించారు. మీలాంటి వారి వల్లే పార్టీ నష్టపోతుందన్నారు. క్రమశిక్షణ కమిటీ కోరితే సంజాయిషీ ఇస్తాను అని స్పష్టం చేశారు.ఏదేమైనా ఎంపీ రఘరామకృష్ణంరాజు వైసిపికి ఎదురు తిరగడం అన్నది రాష్ట్ర రాజకీయాల్లోనే పెను సంచలనంగా మారింది.పార్టీ అధినేత జగన్ ను , అగ్రనాయకుడు విజయసాయిరెడ్డిని ఇంతగా ధిక్కరించిన వాడు మరొకరు కనిపించటం లేదు.

author avatar
Yandamuri

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju