కిలాంతో బాబు కనెక్షన్ ఏమిటి?

ఢిల్లీ, జనవరి 10: ప్రకాశం జిల్లాలో నిర్మించనున్న ఏపీపీ పేపరు మిల్లు యాజమాన్యం వెనుక చీకటి కోణం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. 2017లో లీక్ అయిన ప్యారడైజ్ పేపర్స్ నల్ల కుబేరుల జాబితాలో ఏపీపీ గ్రూప్‌తోపాటు ఆ సంస్ధ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిలాం పేరు అనేక చోట్ల ప్రస్తావనకు వచ్చిందని ఆయన చెప్పారు. దీని గురించి ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
చంద్రబాబు-కిలామ్‌కు మధ్య ఉన్న లావాదేవీలను బహిర్గతం చేయాలని ఆయన కోరారు.
బుధవారం రామాయపట్నంలో ఏపీపీ పేపరు మిల్లుకు చంద్రబాబు శంఖుస్ధాపన చేశారు.