NewsOrbit
న్యూస్

తను మరణించి.. 8 మందిని బతికించి..! మానవత్వానికి ఊపిరిచ్చిన పోలీస్..!!

 

 

ప్రజల ప్రాణాలకి రక్షణ కలిపించాలి అనే ఆశయం, అతనిని రక్షణ విభాగం వైపు అడుగులు వేసేలా చేసింది. ప్రజల ప్రాణాలు కాపాడతాను అన్ని అతను చేసిన ప్రమాణం.. చనిపోయిన తరువాత కూడా,తమ కుటుంభం సభ్యులు అతని అవయవాలను దానం చేయడం తో నిలబెట్టుకున్నాడు. తాను మరణించి కూడా, మరో 8 మంది ప్రాణాలు కాపాడాడు ఈ పోలీస్. అసలు ఎవరు ఇతను… ఏంటి ఈ కథ….

 

konneru anjineyullu

వివరాలలోకి వెళ్తే తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని బాబాపూర్ గ్రామానికి చెందిన కోనేరు ఆంజనేయులు,రక్షణ విభాగం లో 2018 బ్యాచ్ కు చెందిన వాడు. ఇతను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిఎఆర్ హెడ్ క్వార్టర్స్ స్పెషల్ పార్ట్ లో ఎఆర్ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 18 న స్వగ్రామం నుండి విధులకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా పూడూర్ మండల పరిధిలోని సోమన్ గుర్తి గేటు వద్ద మన్నెగూడెం వైపు వేగంగా వెళ్తున్న బోలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడి తలకు, శరీరానికి బలమైన గాయాలయ్యి అపస్మారక స్థితికి చెరుకున్నాడు. ఇది గమనించిన చుట్టుపక్కన వారు చికిత్స నిమిత్తం ఆంజనేయులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి, అతడి కుటుంబసభ్యులకు తెలియజేశారు. కుటుంబసభ్యులు ఆంజనేయులును మెరుగైన చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆంజనేయులు, శనివారం ఉదయం 2 గంటల సమయం లో బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు నిర్ధారించారు. ఆంజనేయులు కుటుంబసభ్యులను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ పరామర్శించారు. ఆంజనేయులు శరీరంలోని అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను కాపాడవల్సిందిగా వారిని సీపీ కోరారు. దానికి అంగీకరించిన కుటుంభం సభ్యులు, కానిస్టేబుల్ కొనేరు ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కళ్లు తదితర ఎనిమిది అవయవాలను ఇతరులకు ఉపయోగించేందుకు గాను సైబరాబాద్ పోలీసుల ఆర్గాన్ డొనేషన్ ఇనీషియేటివ్ ‘మరో జన్మ’ సహకారంతో ప్రభుత్వరంగ సంస్థ ‘జీవన్ దాన్’కు అప్పగించారు.

 

sajjanar

కుటుంబానికి ఆధారం అయినా వ్యక్తి, ఇక లేరనే బాధలో ఉన్నప్పటికీ మరో ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను సీపీ అభినందించారు. బాబాపూర్‌లో అతడి మృతదేహం వద్ద నివాళులర్పించిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ పాడె కూడా మోశారు. మృతుడి కుటుంబాన్ని పోలీస్ శాఖాపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే ప్రజలలో ఉన్న,అపోహలను తొలగించి,బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఆర్గాన్ డొనేషన్ శాతాన్ని పెంచాలి అన్ని, అవయవదానం మీద ప్రజలకు అవగాహనా కల్పించాలి అన్నే సదుద్దేశంతో రెండేళ్ల కిందట సైబరాబాద్ పోలీసుల, పోలీస్ కమిషనరేట్‌లో ‘మరో జన్మ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవదానం చేస్తే ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారవుతారని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. మనిషి చనిపోయాక తనతోపాటే శరీరంలోని అవయవాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాతా జీవించవచ్చు. అవయవాలన్నీ వేరొకరి శరీరంలో ఉండటం వల్ల మనిషి భౌతికంగా దూరం అయినా జీవించినా ఉండడమే అని అయినా అన్నారు.

బ్రేన్‌ డెత్‌కు గురైన వారి విషయంలో చాలా అవయవాలు అవయవ మార్పిడీకి అనువుగా ఉంటాయి. మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాలుగా చెప్పుకునే గుండె, లివర్‌, ఊపిరితిత్తులు, కిడ్నీలు, పేంక్రి యాస్‌, చిన్న, పెద్ద ప్రేగులు, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు, నరాలు తదితర అవయవాలన్నీ అవయవ మార్పిడీకి ఉపయోగించవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది అవయవాల మార్పిడి కోసం ప్రయత్నించి విఫలం చెంది మరణిస్తున్నారు. కారణం అవయవాలు కావాల్సిన వారికన్నా.. అవయవాలు దానం చేసే వారి సంఖ్య చాలా తక్కువ ఉండటమే. అందుకే మనలాంటి వారిని కాపాడుకునేందుకు అవయవదానం చేద్దాం. తుది శ్వాస విడిచాకే మన శరీరం నుంచి అవయవాలు సేకరిస్తారు. చనిపోయాక కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం అవయవదానం ఇస్తోంది. అందుకోసం బతికున్నప్పుడే ఆర్గాన్ డోనర్ కింద పేరు నమోదు చేయించుకోండి.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!