ప్రముఖ నటుడు విక్రమ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. దక్షిణాది టాప్ హీరోల లిస్ట్‌లో విక్రమ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఈ తరం హీరోల్లో విక్రం వేసిన గెటప్పులు మరే హీరో వేయలేదు. ముఖ్యంగా ‘అపరిచితుడు’ సినిమాలో ట్రిపుల్ యాక్షన్‌తో తన సత్తా చాటుకున్నాడు. అంతేకాకుండా అపరిచితుడు సినిమా విక్రమ్‌ను ఒక గొప్ప స్టార్‌గా మార్చేసింది. అంతవరకు బానే ఉంది కానీ ఆ తర్వాత నుంచి విక్రమ్ హిట్ కొట్టడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాడు. గత పది ఏళ్లుగా విక్రమ్ నుంచి ఒక మంచి సినిమా కూడా విడుదల కాలేదు. సినిమా కథ కంటే గెటప్‌లకే ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూ ప్రయోగాలలో అతి చేస్తూ ఉండటం వల్లే అతని కెరీర్ సంకట స్థితిలో పడిపోయింది.
మళ్లీ ఆ తప్పు చేస్తున్న విక్రమ్
విక్రమ్ తన సినిమాల్లో కనీసం 2-3 గెటప్పులలో కనిపించడానికి ఎక్కువ ప్రాధన్యత ఇస్తాడు. గెటప్పులపై పెట్టిన దృష్టి కథ ఎంచుకోవడంలో పెట్టడం లేదనే విమర్శలు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం విక్రమ్ ‘కోబ్రా’ అనే సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో కూడా సేమ్ గెటప్‌ల పరంపరనే రిపీట్ చేశాడు. ఈ సినిమాలో ఎకంగా ఏడెనిమిది గెటప్పుల్లో కనిపించబోతున్నాడు. ట్రైలర్ కట్ చేస్తే ఆ ట్రైలర్ మొత్తం విక్రమ్ వేసిన గెటప్పులను చూపించడానికి సరిపోయింది.
ఈసారి తేడా వస్తే కెరీర్‌కి ఎండ్ కార్డే
ఆ సినిమాలోని పాత్రల కోసం విక్రమ్ ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఒక్కోక్క గెటప్ వేసుకోవడానికి కనీసం గంట సమయం పడుతుంది. విక్రమ్ పాత్రకు తగ్గట్టు తనను తను మార్చుకొని, తన శరీరాన్ని కష్టపెడతాడు. అంత కష్టపడ్డా కూడా ‘అపరిచితుడు’ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు. ఎవరైనా హీరో గెటప్ వేస్తే వెరైటీగా ఉంటుంది, కానీ విక్రమ్ కి మాత్రం అది కొట్టిన పిండిలా ఉంటుంది. ఎన్ని విమర్శలు వచ్చినా అన్నిటినీ పక్కనపెట్టి తన దారిలో తాను వెళుతుంటాడు. అయితే విక్రమ్ ‘కోబ్రా’ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అతనికి దక్కుతుందో, లేదో?అనేది మాత్రం డౌటే.ఈ నెల 31న విక్రమ్ నటించిన కోబ్రా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా అయినా విక్రమ్ కి మంచి విజయాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.