Village: మీకు వందేళ్లు బతకాలని ఉంటే ఊరు వెళ్ళండి…!

Share

UK village: ప్రస్తుత బిజీ బిజీ గజిబిజి జీవితంలో 60 ఏళ్లు బతకడమే మహా గగనం. అటువంటిది ఒక ఊర్లో ఏకంగా వందేళ్ల పాటు జీవించగలుగుతున్నారు. హుషారుగా వందేళ్ల బర్త్ డేలు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఆ గ్రామం గురించి ఒక్కసారి తెలుసుకుంటే షాక్ కావడం మన వంతవుతుంది.

ఇంతకీ ఏ ఊరది?

వందేళ్లు జీవించే ఊరు ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ ఉందని చాలా మంది వెతుకుతారు. అటువంటి ఊరు కోసం చాలా సెర్చ్ చేస్తారు. ఆ ఊరు యూకే(UK)లోని డెట్లింగ్(Delting). కేవలం 800 మంది మాత్రమే ఉన్న ఈ ఊరి గురించి వివరాలు తెలుసుకుంటే షాక్ అవుతారు. వందేళ్ల జీవనం కోసం వారు అలవర్చుకున్న జీవన విధానాలు మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అక్కడ పుట్టిన ప్రతి ఒక్కరూ సర్వసాధారణంగా వందేళ్ల పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ ఉంటారు. మరీ షాకింగ్ గా ఇక్కడి ప్రజల సగటు వయసు పక్క ఊళ్లకు చెందిన ప్రజల సగటుతో పోలిస్తే దాదాపు 12 సంవత్సరాలు ఎక్కువగా ఉండడం విశేషం.

800 మందికే 8 మంది డాక్టర్లు..


డెట్లింగ్ ప్రజలు ఆరోగ్యం గురించి తీసుకునే శ్రద్ధను చూస్తే చాలా ముచ్చట కలుగుతుంది. ఈ గ్రామంలో ఉన్న 800 మంది జనాభా కోసం ఏకంగా 8 మంది డాక్టర్లు ఉన్నారు. అంతే కాకుండా వీరు తమ పరిసరాలను చాలా నీట్ గా ఉంచుకుంటారు. శుభ్రమైన మంచి నీటినే తీసుకుంటారు. వారు పీల్చే గాలి చాలా శుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. ఇక మరో విషయం ఈ గ్రామ ప్రజలు ఎవరూ కూడా ధూమపానం జోలికి అస్సలు వెళ్లరు. ఊరు విడిచి పెట్టి బయటకు వెళ్లినపుడు కూడా ఈ గ్రామ ప్రజలు సిగరెట్లు ముట్టుకోరు. అంత నిజాయతీగా ఉంటారు కాబట్టే ఈ గ్రామంలోని అందరికీ వందేళ్ల బర్త్ డే(Birth Day) వేడుకలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. సో గ్రేట్ కదా.


Share

Related posts

వకీల్ సాబ్ సెట్లో పవన్ కళ్యాణ్ – శృతి హాసన్.. ఇక మెగా ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్ ..!

GRK

Localbody elections : మొదలు… వివాదాలు! తార స్థాయికి వివాదం!!

Comrade CHE

హద్దులు దాటిన “స్వామి భక్తి”! చిత్తూరు జిల్లా లో విచిత్రం!!

Yandamuri