NewsOrbit
జాతీయం న్యూస్

Lok Sabha Election 2024: ఈవీఎంలను నీటి గుంటలో పడేసిన గ్రామస్థులు .. పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా శనివారం చివరి దశ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ లోని పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.  బెంగాల్ జయనగర్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఓ అల్లరిమూక పోలింగ్ స్టేషన్ లో చొరబడి ఈవీఎం, వివిప్యాట్ లను ఎత్తుకెళ్లి సమీపంలోని నీటి కుంటలో పడేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..కుల్తాలీ గ్రామంలో పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులు, పోలింగ్ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. బేనిమాధవ్ పూర్ ఎఫ్ పీ స్కూల్ బూత్ లోకి ఏజెంట్లను రానీయకుండా కొంత మంది అడ్డుకోవడం తో కలకలం రేగింది. వీరి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. దీంతో అగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్ లోకి ప్రవేశించారు. వీవీ ప్యాట్ తో కూడిన ఈవీఎంను బయటకు తీసుకెళ్లి నీటి గుంటలో పడేశారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు వారిని చెదరగొట్టారు.

అయితే , కుల్తాలీలో ముందు జాగ్రత్త చర్యగా అదనంగా ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీ ప్యాట్ లనే నీటి కుంటలో పడేశారని ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. కుల్తాలీ పోలింగ్ బూత్ లో పోలింగ్ యథావిధిగా జరుగుతోందని స్పష్టం చేసింది. సెక్టార్ ఆఫీసర్ కు మరో ఈవీఎం ను అందజేసినట్లు తెలిపింది. ఈ ఘటనపై కుల్తాలీ సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని, ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారని పేర్కొంది. పోలింగ్ బూత్ వద్ద అదనపు బలగాలను ఏర్పాటు చేసినట్లు వివరించింది.

మరో ఘటనలో కోల్ కతా లోని జాదవ్ పూర్ లోక్ సభ నియోజకవర్గంలోని భాంగర్ లోని సతులియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్), సీపీఐ (ఎం) కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. అనంతరం ఇరువర్గాలు పరస్పరం బాంబులతో దాడులకు దిగారు. ఈ ఘటనలో పలువురు ఐఎస్ఎఫ్ సభ్యులు గాయపడ్డారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N