సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. సమంత నటనలోనే కాదు చదువులోనూ ఫస్టే.. ప్రస్తుతం సమంత టెన్త్ క్లాస్ రిపోర్ట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. వైరల్ అవుతున్న ఈ మార్క్ షీట్ లో మంచి మార్కులతో పాటు ఎన్నో తప్పులు ఉన్నట్లు చూడొచ్చు..
సమంత టెన్త్ మార్క్ షీట్ వైరల్
సమంత టెన్త్ మార్క్ షీట్ వైరల్: రిపోర్ట్ లో సమంత చెన్నైలోని సీఎస్ఐ సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో జరిగింది. మార్కుల విషయానికి వస్తే ఇంగ్లీష్ పేపర్-1లో 90, పేపర్-2లో 74 మార్కులు సాధించినట్లు ఉంది. ఇక మ్యాథ్స్ సబ్జెక్ట్ లో వందకు 100 మార్కులు తెచ్చుకుంది. ఫిజిక్స్ లో 90 కంటే ఎక్కువ మార్కులు, హిస్టరీలో 91 మార్కులు వచ్చాయి.. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ రిపోర్ట్ ని జాగ్రత్తగా గమనిస్తే.. అందులో ఎన్నో తప్పులు ఉన్నట్లు తెలుస్తుంది.. ఆ మార్క్ షీట్ లో ఫిజిక్స్ లో 50 మార్కులకు 95, బోటనీలో 50 మార్కులకు 84 మార్కులు వేసి ఉన్నాయి. మరీ సమంతకు అన్ని మార్కులు ఎలా వేశారు ఆ టీచర్లకే తెలియాలి.
సరే.. ఇది ఎవరో కావాలని చేశారు అనడానికి.. ఈ మార్క్ షీట్ ఎవరో పెట్టింది కాదు.. స్వయంగా సమంతనే తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ మార్క్ షీట్ కచ్చితంగా సమంతదే అని నిర్ధారణ అవుతోంది. ఆ మార్క్ షీట్ లో తప్పులను గుర్తించిన నెటిజన్లు సమంతను ట్రోల్ చేశారు. అసలు 50 మార్కులకు 95 ఎలా వచ్చాయి అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.. ఆ రిపోర్ట్ లో గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే.. ఆ రిపోర్ట్ లో ఇచ్చిన సంవత్సరం ప్రకారం సమంత 14 ఏళ్లకే పదో తరగతి పాస్ అయినట్లు ఉంది. ఇది ఎలా సాధ్యం అవుతుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా తన ఈమేజ్ పెంచుకోవడం కోసమే ఇలా చేసిందని కొందరు కామెంట్ చేశారు.