viral tortoise: నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి. ఒక్కోసారి జంతువులు చేసే పనులను చూస్తుంటే భలే ముచ్చట వేస్తుంది.అలాంటి ఒక ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తాబేలు గురించి తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి. తాబేలు ఎలా నడుస్తుందో కూడా మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా.. అది చాలా అంటే చాలా నెమ్మదిగా నడుస్తుంది. అలాగే ఆపద సమయంలో తనను తాను కాపాడుకోవడం కోసం రక్షణ కవచంగా ఒక బలమైన డిప్ప ఉంటుంది.అది చాలా గట్టిగా ఉంటుంది.
తాబేలు తనని తాను ఎలా రక్షించుకుంటుందంటే??
ఏదైనా ఆపద సంభవించినప్పుడు దాని లోపలికి ముడుచుకొని పోయి తనని తాను రక్షించుకుంటుంది. మరి అంతా నిదానంగా నడిచే తాబేలు ఒక్కసారిగా వేగంగా పరుగులు పెడితే చూడడానికి భలే ఉంటుంది కదా. అలాంటి ఒక అవకాశం ఒక తాబేలుకు వచ్చింది.. అది వచ్చిన అవకాశాన్ని ఊరికే వదిలేస్తుందా.. చెప్పండి స్పీడ్‌గా పరుగెత్తి తన ముచ్చట తీర్చుకుంది. దాని ఆనందానికి అవధులు లేవు. ఈ వీడియోలో కనిపించే తాబేలు తన కాళ్లకి చక్కాలు కట్టుకొని గిర గిరా తిరిగేస్తోంది.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ఇంట్లో ఉన్న తాబేలు ఆ ఇల్లంతా చాలా వేగంగా అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తుంది.
కార్ పైకి ఎక్కి దర్జాగా కూర్చుని పరుగులు పెడుతున్న తాబేలు :
ఆ తాబేలును చుసినవారందరు తాబేలు ఏంటి.? ఇలా వేగంగా పరుగులు పెడుతుంది ఏంటి ఆరాగా చూడగా అప్పుడు అసలు విషయం అర్ధం అయింది. ఆ తాబేలు ఒక కారు బొమ్మపైన కూర్చుంది.ఆ కారుకు నాలుగువైపులా చక్రాలు ఉన్నాయి. ఇక దానిపైన కూర్చున్న తాబేలు తన కాలుని కాస్త కదిపినా చక్రాలు వేగంగా కదులుతున్నాయి. దాంతో తనకు ఏదో కొత్త శక్తి వచ్చినట్లు భావించి రై రై మంటూ ఆ కారు బొమ్మపై కూర్చుని తెగ ఉత్సాహంగా ఆ ఇంట్లోని హాలంతా తెగ తిరిగేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చుసిన వారందరు తాబేలును చూసి ఓరి దీని వేషాలు అంటూ కామెంట్స్ పెడుతున్నారు