NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viral Video Effect: ఫలించని పిఓ ఎత్తుగడలు..! విచారణలో బట్టబయలైన రాసలీలల బండారం..! ఆ తరువాత ఏమైందంటే..?  

Viral Video Effect: పశ్చిమ గోదావరి జిల్లా ఐటీడీఏ పిఓ రాసలీలల వ్యవహారం ఇటీవల వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ యువతి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిపై సంచలన ఆరోపణలతో విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలాన్ని రేపింది. ఇద్దరు మధ్య వర్తులు తనను పీఓ వద్దకు ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకువెళ్లారనీ, ఆ సమయంలో ఆయన తణుకు వార్డెన్ పోస్టు ఇప్పించేందుకు కమిట్‌మెంట్ అడిగారని ఆమె ఆరోపించింది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో గత్యంతరం లేక ఆయనకు లొంగిపోయాననీ, పలు మార్లు శారీరకంగా వాడుకున్నారనీ యువతి వాపోయింది. ఉద్యోగం ఇప్పించకుండా మాయమాటలు చెబుతూ కాలయాపన చేస్తుండటంతో మోసపోయానని అర్థం అయ్యిందనీ, ఇలా మరో యువతి మోసపోకూడదన్న ఉద్దేశంతో విషయాలను వెల్లడిస్తున్నానని ఆమె వీడియో విడుదల చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

Viral Video Effect: ITDA po arrest
Viral Video Effect ITDA po arrest

దీనిపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తొలుత ఆ అధికారిని అక్కడ నుండి బదిలీ చేసి విచారణకు ఆదేశించారు. ఈ తరుణంలోనే ఆ యువతి పీఓ ఏ తప్పు చేయలేదనీ, తనను వాడుకోలేదనీ, ఇద్దరు యువకులు తనతో బలవంతంగా వీడియో చేయించారంటూ మరో వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఆ యువతిపై నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ యువతి విడుదల చేసిన రెండు వీడియోల్లో ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ వ్యవహారంపై పోలవరం డీఎస్పీ లతాకుమారి విచారణ జరపగా పీఓకు సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో పలువురు యువతులను ఆయన లొంగదీసుకున్నాడని విచారణలో వెల్లడైంది.

Read more: Viral News: ఉద్యోగం ఇప్పిస్తానని కమిట్మెంట్ అడిగారు.. అధికారిపై యువతి సంచలన ఆరోపణలు..!! పార్ట్ -1

తొలుత పీఓకు సహకరించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ జరపగా పీఓ రాసలీలల బండారం మొత్తం వెలుగులోకి వచ్చింది. దీంతో పిఓతో పాటు అయిదుగురిని అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం కోర్టులో హజరుపర్చారు. అనంతరం మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు వీరిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఈ వ్యవహారంలో బాధిత యువతి ఆవేదన కరెక్టేనని తేలింది. అయితే పీఓ తన రాసలీలల బండారం బయటపడకుండా ఉండేందుకు తన మనుషులతో ఆ యువతిని భయపెట్టి రెండో వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్టు చేయించినట్లు స్పష్టం అవుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju