Viral video: సాధారణంగా బస్సులు, రైళ్లలో ప్రయాణీకులు సీటు కోసం గొడవ పడటం, కొట్టకోవడం మనం తరచు చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా ప్రయాణీకులు రద్దీ అధికంగా ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటుంటాయి. కానీ ఇద్దరు వ్యక్తులు విమానంలో గొడవకు దిగి కొట్టుకోవడం ఇతర ప్రయణీకులను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది జరిగింది అమలాపురం లాంటి ఇండియా గ్రామాల్లో కాదు, అగ్రరాజ్యం అమెరికాలో జరగడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొట్లాడుకునే వారికి అమలాపురం అయినా ఒకటే అమెరికా అయినా ఒకటే. బస్సు అయినా ఎయిర్ బస్సు అయినా ప్రయాణీకులు కొట్టుకోవడం కామన్ అని నిరూపించారు వీళ్లు.
విషయంలోకి వెళితే.. ఆమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. న్యూఓర్లీన్స్ నుండి అస్టిన్ వెళుతున్న విమానంలో ఇద్దరు ప్రయాణీకుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో ఇద్దరు ప్రయాణీకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పక్కన ఉన్న ప్రయాణీకులు వారిస్తున్నా వారు వినకుండా కొట్టుకున్నారు. గొడవ ఆపాలంటూ ప్రయాణీకులు అరిచినా వారు పట్టించుకోకుండా ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వీరు ఇద్దరు కొట్టుకుంటూ ఇతర ప్రయాణీకుల మీద పడ్డారు. అయితే వీరి ఇద్దరి మధ్య సీటు విషయంలో గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రయాణీకుల ఘర్షణతో ఇతర ప్రయాణీకులు ఒక్క సారిగా షాక్ గురైయ్యారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?