Love proposal: ప్రేమ… వినడానికి రెండు అక్షరాల మాటే కదా అని అనుకుంటే పొరపాటు పడినట్లే. ప్రేమలో పడితే గాని ఎవరికీ ఆ ప్రేమ విలువ తెలియదు. ప్రేమించడం ఎవరయినా చేస్తారు కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడం మాత్రం అందరి వల్లా కాదు. ఎందుకంటే కొందరు ప్రేమను వ్యక్తపరచాలంటే బయపడతు ఉంటారు. మరి కొందరు మాత్రం తమ ప్రేమను ప్రియురాలికి తెలిసేలా వెరైటీగా ప్లాన్ గా చేసుకుంటారు.ఎందుకంటే ఆ అపురూప క్షణాలను పదికాలాల పాటు పదిలంగా దాచుకొవాలని అనుకుంటారు. ప్రియుడు ప్రొపోజ్ చేసే విధానం చూసి ప్రియురాలికి సైతం మాటలు కరువవుతాయి. ఈ రకమైన వీడియోలను మనం సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటాము. అందరు చూస్తుండగానే ప్రేయసికి ప్రొపోజ్ చేయడం అనేది ఇప్పుడు చాలా ట్రేండింగ్ గా మారిపోయింది.
Love proposal: వీడియో వైరల్
ఇందుకు సంబందించిన వీడియోలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా.. ఇలాంటి వెరైటీ లవ్ ప్రపోజల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక వైపు మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా గర్ల్ ఫ్రెండ్ కు లవ్ ప్రపోజ్ చేయగా అతడు ఇచ్చిన షాక్ కు ఉబ్బితబ్బిబ్బు అయిపొయిన ప్రియురాలు ఒకే అనడంతో అక్కడున్న వారు అందరు చప్పట్లు కొట్టారు. ఈ ఘటన బ్రిస్బేన్ లోని గబ్బాలో మైదానంలో చోటు చేసుకుంది. గబ్బాలో యాషెస్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలిటెస్టు మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా క్రీడాభిమానులు అందరూ మ్యాచ్ ను తిలకిస్తున్నారు.
లవ్ ప్రపోజల్
ఈ క్రమంలోనే రాబ్ అనే వ్యక్తి ఒక్కసారిగా లేచి తన ప్రేయసి నాట్ ముందు మోకాళ్లపై కూర్చొని బాక్స్ లోనుంచి ఉంగరం తీసి తన ప్రేమను ఆమె ముందు వ్యక్తపరిచాడు.అది చుసిన నాట్ ఆశ్చర్యానికి లోనై తెగ సంబరపడిపోతూ ముసిముసి నవ్వులు నవ్వుతూ అతనికి ఒకే చెప్పేసింది. ఆ తరువాత ఒకరినొకరు కౌగలించుకుని, లిప్ టు లిప్ కిసెస్ పెట్టుకున్నారు. వీరిద్దరిని చుసిన వారు చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఒకపక్క మ్యాచ్ మరోపక్క లవ్ ప్రపోజల్ తో చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్టు అనిపించింది. కొందరు అయితే ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్స్ లో బంధించారు. ట్విట్టర్ వేదికగా ఈ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారిపోయింది.