NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Viral Video: పోలీసుల ముందే కొట్టుకున్న నర్సు, డాక్టర్ వైరల్ వీడియో..

Viral Video: కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది.. దేశంలో రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ క్రమంలో ఆరోగ్య సిబ్బంది నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. వారు రోగులకు సేవలు అందిస్తూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఒత్తిడి మధ్య విధులు నిర్వహించడం తలకు మించిన భారంగా మారుతుంది. దీంతో పలు ఆసుపత్రుల్లో డాక్టర్లకు, డాక్టర్లకు మధ్య.. డాక్టర్లకు, నర్సులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒత్తిడిలో సహనం కోల్పోయి ఒకరిపై మరొకరు దూషణలకు దిగడమే కాకుండా.. చేయి చేసుకుంటున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.

Viral Video: Nurse slapped doctor Infront of police
Viral Video Nurse slapped doctor Infront of police

ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ జిల్లా ఆసుపత్రిలో డాక్టర్ కు నర్సుకు మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు. సహనం కోల్పోయిన నర్సు డాక్టర్ చెంపపై గట్టిగా కొట్టింది. దాంతో ఆమెపై డాక్టర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం పోలీసులు ముందే జరగడం గమనార్హం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. రాంపూర్ సిటీ మెజిస్ట్రేట్ రామ్ జీ మిశ్రా కూడా ఘటనపై ఇద్దరిని విడివిడిగా విచారించారు. కొట్లాడుకున్న డాక్టర్, నర్స్ ఇద్దరితో వేరువేరుగా మాట్లాడానని, ఇద్దరూ కూడా పని ఒత్తిడి భారంతోనే తాము సహనం కోల్పోయి ప్రవర్తించామని చెప్పారని వివరించారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

author avatar
bharani jella

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju