(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
అమెరికాలోని ఉటాలో నివసిస్తున్న ఇసాక్ రిచర్డ్స్ ఐస్ క్రీమ్ పార్లర్లో కస్టమర్లతో తెలుగులో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తాను హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడలో పర్యటించినప్పుడు తెలుగు భాష నేర్చుకున్నట్లు ఇసాక్ చెబుతున్నాడు.
అమెరికన్ దేశస్థుడైన ఇసాక్ అచ్చమైన తెలుగుభాషలో మాట్లాడుతూ కస్టమర్లను ఆకర్షించడాన్ని గణేష్ కేశన అనే యువకుడు సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి తన ఫేస్ బుక్ ఎకౌంట్లో పోస్టు చేశాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఇప్పటి వరకూ రెండులక్షల మందికిపైగా నెట్జన్లు వీక్షించగా వేలాది మంది లైక్లు ఇస్తున్నారు.
https://www.facebook.com/kittunaidug/videos/1832573920179605/