వైరల్ వీడియో: చిన్న పొరపాటు.. ఎలా యువతి ప్రాణం తీసిందో చూడండి..!

మనిషి అంటేనే తప్పులు చేస్తాడు. మనం మన జీవితంలో ఎన్నో తప్పులు చేస్తుంటాం. కొన్ని కావాలని చేసినా కొన్ని అలా జరిగిపోతుంటాయి. మన ప్రమేయం లేకున్నా కొన్ని తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పు వల్ల జరగరానిది ఏమైనా జరిగితే తర్వాత జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. జీవితాంతం బాధపడినా.. ఆ తప్పు వల్ల జరిగే నష్టాన్ని ఎవ్వరూ పూడ్చలేరు. అది తరతరాలు వెంటాడుతుంది.

viral video of young girl died at watefall
viral video of young girl died at watefall

తాజాగా ఈ వీడియో చూస్తే కూడా అదే అనిపిస్తుంది. ఎవరో చేసిన తప్పుకు ఓ యువతి బలైపోయింది. అన్యాయంగా బలైపోయింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. గత కొన్ని రోజుల నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఓ జలపాతం వద్ద అందరూ సరదాగా ఆడుకుంటున్నారు. ఇంతలో ఓ యువతి కింది నుంచి ఆ జలపాతం దగ్గరికి వచ్చింది. అంతలోనే ముగ్గురు బాలురు పైన ఉన్న బండ నుంచి జారుతూ జలపాతంలోకి వెళ్తున్నారు. అయితే.. అక్కడ ఆ యువతి నిలబడిన విషయాన్ని చూసుకోకపోవడంతో… ఆ యువతి కాళ్లకు జారుకుంటూ వచ్చిన వాళ్లు తగలడంతో ఆ యువతి అమాంతం కిందపడిపోయింది. అక్కడ అన్నీ రాళ్లు ఉండటంతో.. తన తలకు రాయి బలంగా తాకింది. దీంతో క్షణాల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది.

ఆ పిల్లలు కూడా ఏదో సరదాగా జలపాతం వద్ద ఆడుకుంటున్నారు. కానీ.. అలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఊహించనిది జరగడమే జీవితం అంటే.. ఏది ఏమైనా చిన్న పొరపాటుకు ఓ ప్రాణం బలి అయిపోయింది.