Viral video: చాలా మంది వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా.. హెల్మెట్ ధరించకుండా రోడ్ల మీదకి వస్తుంటారు. ఎవరు ఎంత చెప్పినా ఏమవుతుందిలే అనే ఓ నిర్లక్ష్యం చాలామందిలో ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ విధి వక్రీకరించి ఏదైనా జరిగితే.. ఆ నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.
హెల్మెట్ ధరించిన వారు చనిపోయే ప్రమాదం చాలా తక్కువని చాలా సంఘటనల్లో నిరూపితమయింది. ఉదాహరణకి, హెల్మెట్ ధరించడం వల్ల మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడగలిగారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక సాధారణ వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోగలిగాడు. లేదంటే అతని తలకాయ నుజ్జునుజ్జు అయ్యి చనిపోయి ఉండేవాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ కూడా ట్విటర్ లో షేర్ చేసి “హెల్మెట్ సేవ్స్ లైఫ్” అని పేర్కొన్నారు.
ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి బైక్పై వెళ్తున్నట్టు కనిపించింది. ఆ సమయంలోనే ఎదురుగా ఒక ట్రాక్టర్ వెళుతోంది. అతడు ప్రయాణిస్తున్న రోడ్డు వర్షపు నీటితో నిండిన గుంటలతో చాలా ప్రమాదకరంగా కనిపించింది. అయితే అతడు అవేమీ పట్టించుకోకుండా ట్రాక్టర్ పక్కనుంచే బైక్ పోనిచ్చాడు. సరిగ్గా అదే ప్రదేశంలో ఒక గుంట ఉండటంతో బైక్ అందులో పడింది. క్షణాల్లోనే బైక్ అదుపు తప్పడంతో అతడితో సహా భార్యపిల్లలు ట్రాక్టర్ కింద పడ్డారు. మరుక్షణంలోనే ట్రాక్టర్ టైరు ఆ వ్యక్తి తలపై నుంచి వెళ్ళింది.
BREAKING: ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ ఎత్తుకెళ్లిన మందు బాబులు..!
అదృష్టవశాత్తు అతడు హెల్మెట్ ధరించడంతో తల చితికిపోలేదు. హెల్మెట్ ధరించకపోయినట్లయితే.. అతడు కచ్చితంగా మరణించేవాడు. భార్య కూడా ట్రాక్టర్ కింద పడింది కానీ ఆమె క్షణాల్లోనే తప్పించుకోగలిగింది. భూమ్మీద నూకలు ఉన్నట్టు.. కింద పడిన ఫోర్స్ కి భార్య ట్రాక్టర్ కిందనుంచి బయటకి తోసుకుని వచ్చింది. ఆ క్షణంలోనే ఆమె చాకచక్యంగా తన బిడ్డని కూడా బయటకు తీసుకు వచ్చింది. దాంతో ఈ భయంకరమైన ప్రమాదం నుంచి వీరంతా కూడా సురక్షితంగా బయటపడ్డారు. హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు కదా.. ఇక నుంచైనా మీరు హెల్మెట్ ధరించడంతో పాటు మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు హెల్మెట్ ధరించేలా ప్రోత్సహించండి.
#Helmet saves life…
#ट्रैक्टर का पूरा #पहिया सर के उपर से होकर गुज़र गया लेकिन #बाइकचालक को कुछ नहीं हुआ ।? pic.twitter.com/TIG3wtgV6P
— Rupin Sharma IPS (@rupin1992) September 18, 2021