ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ మరియు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వాడిన తన ఫస్ట్ ఆడీ కారు దాదాపు ఏడాదిగా పోలీస్ స్టేషన్ డంప్ యార్డులోనే ఉంటుందట. ఇటీవల ఓ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్ ఆ లగ్జరీ కార్ ను గుర్తించి దాని వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టారు. ఈ కారుకి సంబంధించిన ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి. ఆడీ కంపెనీ కి చాలా ఏళ్లుగా విరాట్ కోహ్లీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్న సంగతి మనకి విదితమే. ఆడీ కంపెనీ ఆర్8 వీ10 లగ్జరీ కారును కోహ్లీకి బహుమతిగా ఇచ్చింది.
ఇది జరిగిన కొంత కాలానికి కోహ్లీ ఆ కారును ఇంకొక వ్యక్తికి అమ్మేశాడు. అతని పేరు సాగర్ థక్కర్. సాగర్ కోహ్లీ నుంచి కొన్న ఆ లగ్జరీ కారును తన గర్ల్ ఫ్రెండ్ కు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమనగా సాగర్ అనే అతనికి గతంలో నేర చరిత్ర ఉంది. సాగర్ రూ. 12 కోట్ల స్కామ్ చెయ్యడంతో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అతని ఆస్తులను జప్తు చేశారు. ఆలా పోలీసులు జప్తు చేసిన ఆస్తులలో సాగర్, కోహ్లీ వద్ద కొన్న ఆడీ కారును కూడా సీజ్ చేశారు.
పోలీసులు ఈ కారును థానే పోలీస్ స్టేషన్ లో ఏడాదిగా ఉంచడంతో ఆ కారు దుమ్ము పట్టేసింది. ఏడాదిగా ఆ లగ్జరీయస్ కారు అక్కడే ఉండడం వలన దాని ఖరీదును లెక్కించడం కూడా కష్టమేనని అంటున్నారు ఆ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్ పర్ట్.