Virata Parvam : రానా దగ్గుబాటి, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. ఇందులో రానా అడవిలో నివాసం ఉండే కమ్యూనిస్టుగా పోరాటం కొనసాగిస్తున్నట్లు ముందుగా వచ్చిన ఫస్ట్ లుక్ ద్వారానే మనం చెప్పవచ్చు. ఈ చిత్రానికి వేను ఉదుగుల దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈశ్వరి, ప్రియమణి ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ వేణు మొదటి చిత్రమైన ‘నీది నాది ఒకే కథ’ తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. శ్రీ విష్ణు కెరీర్ కి కూడా ఈ సినిమాకి బాగా ఉపయోగపడింది.
ఇక కొద్దిసేపటి క్రితం విడుదలైన ‘విరాటపర్వం’ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి గారు రిలీజ్ చేశారు. సాయి పల్లవి తన ప్రేమను దక్కించుకోవడానికి చేసిన యుద్ధం, ప్రియమణి, రానా చేస్తున్న పోరు…. మన సమాజంలో ఉన్న విద్వేషాలు, రాజకీయాలు వాటి వల్ల జనాల పై ప్రభావం చూపుతున్న వైపరీత్యాల దృష్ట్యా ఈ కథను రాసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.