NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Visakha : పరిపాలనా రాజధానిలో ఓ కీలక భవన నిర్మాణానికి రూ.14 కోట్లు బదలాయింపు

YS Jagan : ఢిల్లీ పర్యటనల్లో అసలు మతలబు లేంటి?

Visakha : ఏపి పరిపాలనా రాజధానిగా విశాఖపట్టణానికి తరలింపునకు జగన్ సర్కార్ గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తూనే ఉంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, మంత్రులు బొత్సా సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్ తదితరులు త్వరలో విశాఖకు పరిపాలనా రాజధాని తరలింపు జరుగుతుందని పలు సందర్భాలలో వెల్లడించారు. రాజధాని వ్యాజ్యం హైకోర్టులో నడుస్తున్నందున రాజధాని తరలింపు ఆలస్యం అవుతోంది. కోర్టు తీర్పు వచ్చిన వెంటనే వేగంగా రాజధాని తరలింపు ప్రక్రియ వేగంగా జరిపేందుకు ప్రభుత్వం సన్నద్దంగా ఉంది. ఇప్పటికే విశాఖలో పరిపాలనా రాజధానికి అవసరమైన భవనాల పరిశీలన చేసి ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ విశాఖకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకున్నది.

Visakha command control room
Visakha command control room

విజయవాడలో 13 కోట్ల 80 లక్షల రూపాయలతో  నిర్మించతలపెట్టిన కమాండ్ కంట్రల్ రూమ్ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకున్నది. ఈ కమాండ్ కంట్రోల్ భవనాన్ని విశాఖలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి కేటాయించిన రూ.13.80 కోట్లను విశాఖలో నిర్మించనున్న కమాండ్ కంట్రోల్ రూమ్ కు బదలాయిస్తున్నట్లు పేర్కొంది.

రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం తమకు సంబంధం లేదన్నట్లుగా ఇంతకు ముందే చెప్పేసింది. రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది అంటూ హైకోర్టు నందే అఫిడవిట్ దాఖలు చేసింది. అదే విధంగా న్యాయ రాజధాని విషయంలోనూ హైకోర్టు కర్నూలుకు తరలింపునకు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రే ఇటీవల తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వ, హైకోర్టు ఏకాభిప్రాయానికి వస్తే హైకోర్టు మార్చుకోవచ్చంటూ క్లారిటీ ఇచ్చేసింది కేంద్రం. ఇక హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే క్షణం ఆలస్యం చేయకుండా పరిపాలనా రాజధానిని విశాఖకు తరలించనున్నది. ఒక వేళ ప్రతికూలంగా తీర్పు వస్తే వెంటనే ఈ తీర్పును ప్రభుత్వం. సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. మరో పక్క రాజధాని అమరావతి ప్రాంతంలో ఏడాదికి పైగా   రైతులు తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు.

 

author avatar
Srinivas Manem

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju