NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్దమన్న జనసేన నేత మూర్తి యాదవ్ .. లీగల్ చర్యలకు సిద్దమైన సీఎస్ జవహర్ రెడ్డి

ఉత్తరాంధ్రలో సీఎస్ జవహర్ రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని విశాఖ జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ మరో సారి ఆరోపణలు చేశారు. పేద రైతుల ఎసైన్డ్ భూములను లాక్కుకున్నారని అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తమైతే ఏ శిక్షకైనా సిద్దమని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం మరో సారి మీడియాతో మాట్లాడారు మూర్తి యాదవ్.

జవహర్ రెడ్డి కుమారుడు ఆధ్వర్యంలో జరిగిన భూ కుంభకోణంపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక రాష్ట్రంలో 26 జిల్లాలు ఉంటే ఉత్తరాంధ్రకు మాత్రమే ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. భోగాపురం పరిసర గ్రామాలు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ముందుగానే ఇచ్చారని గుర్తు చేశారు. అనందవరం, పద్మనాభం, భీమిలిలో సుమారు 700 ఎకరాల వరకూ ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్లు ఎలా ఇచ్చారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

జీవో 596 ద్వారా వేల కోట్ల రుపాయల కుంభకోణం జరిగిందని మరో సారి ఆరోపించారు. సీఎస్ కుమారుడు ఆధ్వర్యంలోనే ఈ భూ కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ లు, వైసీపీ నేతలే ఈ భూములను ప్రధానంగా కొట్టేశారని విమర్శించారు. సర్వాధికారులు కలిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి .. రైతదుల వద్ద నుండి భూమి మారలేదని చెప్పగలరా..ఈ భూములపై జరిగిన రిజిస్ట్రేషన్లు రద్దు చేయగలరా అని మూర్తి యాదవ్ ప్రశ్నించారు.

ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సీఎస్ గా సర్వాధికారాలు ఉన్నారని, ఆయనకు చిత్తశుద్ది ఉంటే ఈ భూకుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీబీఐ విచారణ అయినా వేయించగలరా అని ప్రశ్నించారు. తాను చేసిన ఆరోపణల్లో నిజం లేదని నిరూపిస్తే .. సీఎస్ జవహర్ రెడ్డి కాళ్లు పట్టుకుని, మీడియా ముందు క్షమాపణలు చెబుతానని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.

మూర్తి యాదవ్ మరో సారి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనకు త్వరలో లీగల్ నోటీసులు జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం హెచ్చరించింది. జనసేన కార్పోరేటర్ మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. శనివారం విశాఖలో మూర్తి యాదవ్ సీఎస్ జవహర్ రెడ్డిపై చేసిన అసత్యమైన, నిరాధార ఆరోపణలు వాస్తవం కాదని స్పష్టం చేశారు.

దీనిపై ఇప్పటికే ఖండిస్తూ పత్రికా ముఖంగా స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. అయినప్పటికీ మూర్తి యాదవ్ ఆదివారం విశాఖలో మీడియా సమావేశం పెట్టి జవహర్ రెడ్డిపై మరో సారి ఆవే అసత్య, నిరాధార ఆరోపణలు చేశారని చెప్పారు. మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు న్యాయనిపుణులను సంప్రదించినట్లు తెలిపారు. త్వరలో కార్పోరేటర్ మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసులు జారీ చేస్తామని సీఎస్ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు.

YCP MLA Pinnelli: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిపై మరో హత్యాయత్నం కేసు

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N