NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP : బీజేపీని ఇరుకున పెడుతున్న ఏపీలో విశాఖ స్టీల్ ప్లాంట్ …తెలంగాణాలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ !

5 States Elections Results: Did BJP Lost or Gain Their Votes..?

BJP : ఆంధ్రప్రదేశ్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ వ్యవహారం మాదిరే తెలంగాణలో కాజీపేట రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ అంశం కాక రేపుతుంది. తాజాగా ఒక సమాచార హక్కు పిటీషన్‌కు సమాధానం ఇస్తూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదంటూ కేంద్ర రైల్వే శాఖ మంత్రి కార్యాలయం సమాధానం ఇచ్చింది.ఇక ఈ ఫ్యాక్టరీకి అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో అధికార టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాక్టరీ కోసం భూమి సేకరించి ఇచ్చినా.. కేంద్రం హామీని నిలబెట్టుకోకపోవడం సరికాదని మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

Visakha steel plant in AP that is narrowing down BJP ... Kazipet coach factory in Telangana!
Visakha steel plant in AP that is narrowing down BJP … Kazipet coach factory in Telangana!

తెలంగాణకు అన్యాయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. తమ హక్కుల కోసం పోరాడతామని చెప్పారు. పార్లమెంట్‌లో ఈ విషయంపై నిలదీస్తామన్నారు కేటీఆర్‌. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కాజీపేట రైల్వే ప్రాజెక్టు అవసరం లేదని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు.రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు వరంగల్‌ ప్రజల చిరకాల వాంఛ అన్నారు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌. ఫ్యాక్టరీయే అవసరం లేదని బీజేపీ అనడం దారుణమన్నారు.కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే మార్చుకుని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు దిశగా విస్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కస్సుమన్న కాంగ్రెస్!

కాగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ సాధన కోసం పోరాటానికి సిద్ధమన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ప్రైవేటీకరణ చేయడం కోసమే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మించడం లేదని ఆరోపించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌ను టీఆర్ఎస్ అడగదు.. బీజేపీ ఇవ్వదని ఎద్దేవా చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలోనైనా పోరాటానికి సిద్ధమన్నారు ఉత్తమ్‌.

BJP : విమర్శలకు బిజెపి ఖండన!

టీఆర్‌ఎస్‌ విమర్శలను తిప్పి కొట్టారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. 2014 నుంచి కేంద్రం.. లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. స్థలం కేటాయించలేదని మండిపడ్డారు. అందుకే కోచ్‌ ఫ్యాక్టరీ వేరే రాష్ట్రానికి వెళ్లిపోయిందన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!