Bigg Boss 5 Telugu: సన్నీ, షణు లపై షాకింగ్ కామెంట్స్ చేసిన విశ్వ..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Big boss) హౌస్ లో…. ఈవారం విశ్వ ఇంటి నుండి బయటకు.. ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. చాలా వరకు కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హౌస్ నుండి విశ్వ(Vishwa) ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు రాగా.. హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ వెంటనే అరీయన కి ఇంటర్వ్యూ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో విశ్వ తన జర్నీ గురించి చాలా సంతోషంగా మాట్లాడినట్లు.. ఎప్పుడో.. ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండేదని.. కానీ ఇంతవరకు జర్నీ జరగటం నిజంగా గ్రేట్ అని.. తన ఆనందాన్ని వ్యక్తపరచినట్లు టాక్.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates | Tv News – India TV

ఇక ఇదే తరుణంలో.. హౌస్ లో… ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్పాల్సిన వచ్చిన సమయంలో విశ్వ(Vishwa).. సన్నీ(Sunny), షణ్ముక్(Shanmukh) పేర్లు వచ్చిన సందర్భంలో… సంచలన కామెంట్ చేయడం జరిగిందట. అయితే ఇద్దరి గురించి చెప్పాల్సిన పరిస్థితి వస్తే గనుక హౌస్లో జరిగేది వేరు, మీకు చూపించేది వేరు అని తెలుసు. ఆల్రెడీ మీరు హౌస్ లో ఉండి వచ్చారు.. మీకు తెలియంది కాదు. ఒక గంటలో ఎంత మేర చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో హౌస్లో సన్ని చాలా ఎంటర్ టైన్ చేసే కంటెస్టెంట్.. అలాగే ప్రతి టాస్క్ లో నాకు మంచి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్. అయితే రానురాను సన్నీ(Sunny).. తనను తాను మార్చుకుంటూ.. చాలా అద్భుతమైన గేమ్ ఆడుతున్నాడు. ఎక్కడైనా తప్పు చేశాను అని అనిపిస్తే వెంటనే వెళ్లి సదరు వ్యక్తికి క్షమాపణ చెబుతున్నాడు. చాలా విషయాల్లో మారేడు పండు సన్నీ గురించి చాలా పాజిటివ్ గా విశ్వా(Vishwa) రెస్పాండ్ అయ్యాడు.

Bigg Boss Telugu 5: ఆ ఇమేజ్ తొలగించుకోవడానికి గేమ్ ప్లాన్ మొత్తం మార్చేసిన షణ్ముఖ్ జస్వంత్..!! | News Orbit

షణుకి బాగా తెలుసు…

ఇక షణ్ముక్ గురించి మాట్లాడుతూ.. మొదటిలో అతడు వ్యవహరించిన తీరు చూస్తే హౌస్ లో అందరికంటే ఎక్కువ గర్వం అతనికి అని అనుకున్నాను. కానీ మొదటి లో అందరి గేమ్ గమనించి.. ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. తన గేమ్ ప్లాన్ ఎలా అమలు చేయాలో.. షణుకి బాగా తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా బాగా తెలుసు. అదే రీతిలో ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాడు. ముఖ్యంగా సిరి కోసం ఏదైనా చేస్తాడు. తన ఫ్రెండ్స్ కి ఏదైనా జరిగితే వెంటనే రంగంలోకి దిగుతాడు ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది. ఇక మిగతా కంటెస్టెంట్ ల విషయానికి వస్తే శ్రీరామ్(Sri Ram) చాలా మెచ్యూర్ గేమ్ ఆడుతున్నాడు. చాలా కంట్రోల్ లో ఉంటూ.. అతని తక్కువ అంచనా వెయ్యకూడదు అని విశ్వా చెప్పుకొచ్చాడు. కచ్చితంగా ఈ ముగ్గురిలో టైటిల్ విన్నర్ ఫైట్ చివరికొచ్చేసరికి ఉంటుందని విశ్వ జోస్యం చెప్పాడు. మరోపక్క బయట కూడా చాలావరకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ తెలుగు సీజన్లలో ఎక్కువగా సైలెంట్ కిల్లర్స్ ట్రోఫి గెలవడం జరిగిందని ఆడియన్స్… చెప్పుకొస్తున్నారు. గత సీజన్ అభిజిత్ ఏ విధంగా గేమ్ ఆడో ప్రస్తుతం హౌస్ లో అదేరీతిలో టైటిల్ విన్నర్ రేసులో ఉన్న వాళ్ళు గేమ్ ఆడుతున్నారని, అంటున్నారు. ఏది ఏమైనా హౌస్ లో ఎక్కువగా హడావిడి చేసే వారి కంటే… చాలా సైలెంట్ కూల్ గేమ్ ఆడే వాళ్ళు..ఈసారి కూడా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరి చివరాఖరికి ఏం జరుగుతుందో చూడాలి.


Share

Related posts

Today Gold Rate: పరుగులు పెట్టిన బంగారం ధర..!! వెండి పతనం..!!

bharani jella

కామాంధుడికి ఉరిశిక్ష

somaraju sharma

Corona Virus: 66 రోజుల తర్వాత.. దేశంలో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు..!

Muraliak