Subscribe for notification

Vismaya Dowry Death: మెడికో విస్మయ ఆత్మహత్య కేసులో భర్త కిరణ్ కుమార్ కు పదేళ్ల జైలు శిక్ష విధించిన కేరళ కోర్టు

Share

Vismaya Dowry Death: గత ఏడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికల్ విద్యార్ధిని విస్మయ ఆత్మహత్య కేసులో భర్త కిరణ్ కుమార్ కు కేరళలోని కొల్లాం అడిషనల్ సెషన్స్ కోర్టు బుధవారం శిక్షను ఖరారు చేసింది. పదేళ్ల జైలు శిక్ష,రూయ12.50లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జస్టిస్ కేఎన్ సుజిత్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు చెప్పింది. మెడికో విస్మయ (24) ఆత్మహత్య కేసులో భర్త కిరణ్ కుమార్ ను నిన్న దోషి గా ప్రకటించిన కోర్టు .. నేడు శిక్షను వెల్లడించింది. నిన్న కిరణ్ కుమార్ ను దోషిగా కోర్టు ప్రకటించిన వెంటనే బెయిల్ పై ఉన్న కిరణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Vismaya Dowry Death case kiran kumar sentenced 10 years

 

ఆయుర్వేద వైద్య విద్యార్దిని విస్మయ చదువు పూర్తి కాకముందే 2019 మే 19 ఆమె తల్లిదండ్రులు అసిస్టెంట్ మోడర్ వెహికల్ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న కిరణ్ కుమార్ కు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో కట్న కానుకలుగా వంద సవర్ల బంగారం, ఎకరం భూమి, పది లక్షల కారు ఇచ్చారు. అయితే కారు నచ్చలేదని తనకు పది లక్షలు నగదు ఇవ్వాలని కిరణ్ కుమార్ డిమాండ్ చేశాడు. దీనికి విస్మయ కుటుంబ సభ్యులు తిరస్కరించారు. దీంతో విస్మయను కిరణ్ కుమార్ వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో గత ఏడాది జూన్ 20న విస్మయ తన బంధువులకు వాట్సాప్ మెసేజ్ చేసింది. కట్నం కోసం కిరణ్ తనను వేధిస్తున్నాడంటూ వాపోతూ అతను కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫోటోలు తీసి పంపింది. ఆ తరువాతి రాజే కొల్లాం జిల్లాై సస్థంకొట్టాలోని కిరణ్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాగా విస్మయ మృతికి భర్త కిరణే కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు సంచలనంగా మారడంతో ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. అతన్ని అరెస్టు చేసి జైలుకు తరలించగా కొన్ని నెలల అనంతరం సుప్రీం కోర్టు ద్వారా కిరణ్ బెయిల్ పొందారు. పోలీసులు ఈ కేసును ముమ్మరంగా దర్యాప్తు జరిపి వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మ హత్యకు పాల్పడిందంటూ 500 పేజీలకు పైగా అభియోగ పత్రాలను కోర్టుకు సమర్పించారు.

కోర్టు దోషి గా తేల్చడంతో కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. నేడు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కాగా కోర్టు తీర్పుపై విస్మయ తండ్రి త్రివిక్రమన్ నయ్యర్ సంతృప్తి వ్యక్తం చేశారు. తన కుమార్తెకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. అయితే విస్మయ తల్లి సజిత మాత్రం దోషికి జీవిత ఖైదు విధిస్తారని భావించామన్నారు.


Share
somaraju sharma

Recent Posts

Hero Yash: పాన్ ఇండియా నిర్మాతల వేటలో హీరో యశ్

Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…

6 mins ago

Pakka Commercial: `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌` ఓటీటీ రైట్స్ ధ‌రెంతో తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌`.…

37 mins ago

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

1 hour ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

2 hours ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

2 hours ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

2 hours ago