కళ్ళను, చర్మాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నారా..! అయితే ఇది చదవక తప్పదు..!!

 

 

సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. పంచేంద్రియాలలో కళ్ళు ఎంతో ముఖ్యం అనేది దీన్ని సారాంశం. ప్రస్తుత సమాజం లో మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్ ఉపయోగం ఎక్కువ అవడం వల్ల కళ్ళు ఎంతో ఒత్తిడికి గురి అవుతున్నాయి. చిన్న వయస్సులోని కళ్ళజోళ్లు వాడకం ఎక్కువ అయిపోయింది. అయితే విటమిన్ ఏ లోపం వల్ల కూడా కళ్ళలోని రెటీనా దెబ్బతింటుంది అని డాక్టర్లు చెప్తున్నారు. బిఎంజె న్యూట్రిషన్, ప్రివెన్షన్ & హెల్త్ లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం, విటమిన్ ఎ, ఇ, డి రిచ్ ఫుడ్స్ మరియు రోగనిరోధక శక్తి వినియోగం మధ్య సంబంధాలను కనుగొంది, ఇది చాలా శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తు, ఇమ్యూనిటీని పెంచి రీప్రొడక్టివ్ సిస్టం సరిగ్గా పని చేసేలా చూస్తుంది.

 

కళ్లకే కాదు మన చర్మ సౌందర్యానికి కూడా విటమిన్ ఏ ఎంతో అవసరం. కళ్ళు మరియు చర్మ ఆరోగ్యానికి విటమిన్ ఏ బాగా సహాయపడుతుంది. రెటినాయిడ్స్ కొల్లాజెన్ ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. ఈ కొల్లాజెన్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలను తగ్గించేందుకు ఎంత గానో ఉపయోగపడతాయి. అంతే కాదు ఇంకా కణాలను రీ బిల్డ్ చేస్తుంది. గాయాలను మాన్పుతుంది మరయు స్కార్స్(ఛారల)ను నయం చేస్తుంది. ఇంకా ‘విటమిన్ ఏ’ సెల్ గ్రోత్ ను రెగ్యులేట్ చేస్తుది. ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం మనిషిని చార్మింగ్గగా కనబడేలా చేస్తుంది . చార్మింగ్ గా కనబడాలనుకోవడం చాలా మంది డ్రీమ్ కూడా. గ్లోయింగ్ స్కిన్ కలిగి ఉండటం కోరిక అయితే విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకొక తప్పదు అంటున్నారు డాక్టర్లు.

విటమిన్ ఏ మానవ శరీరం లో సరి అయినా మోతాదులో ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడుతుంది, కంటి చూపు బాగుంటుంది, ఆక్యులర్ డిసీజెస్ రాకుండా చూస్తుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, పళ్ళు బలంగా ఉంటాయి, సెల్ రీజెనరేషన్ కి తోడ్పడుతుంది, యూరినరీ స్టోన్స్ ని కరిగిస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది, కాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది, స్కిన్ హెల్దీ గా ఉంటుంది, యాక్నే, ముడతలు, ఫైన్ లైన్స్ ని తగ్గిస్తుంది, స్ట్రెచ్ మార్క్స్ రెడ్యూస్ చేస్తుంది, హెల్దీ స్కాల్ప్ కి తోడ్పడుతుంది.

క్యారెట్లు, లివర్, చిలగడదుంప, ఆకుకూరలు, మిల్క్ ప్రొడక్ట్స్, బ్రోకలీ, బాదం పప్పు, టొమాటో, గుమ్మడికాయ, ఎర్ర కాప్సికం, బొప్పాయి పండు , కోడిగ్రుడ్డులు , చేపలు వంటివి ఎక్కువగా మన ఆహార పద్ధతిలో ఉపయోగించడం ద్వారా విటమిన్ ఏ లోపానికి గురికాకుండా మనల్ని మనం కాపాడుకోగలం అని న్యూట్రిషన్ లు తెలియచేస్తున్నారు