NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viveka Murder Case: వివేకా కేసులో సీబీఐకి షాక్..! మేటర్ ఏమిటంటే..?

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి కడప సబ్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ ను కడప సబ్ కోర్టు డిస్మిస్ చేసింది. వివేకా హత్య కేసులో రెండేళ్ల క్రితం హత్యాస్థలంలో సాక్షాలు తారుమారు చేశారనే అభియోగంతో ఎర్ర గంగిరెడ్డిని అప్పటి సిట్ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. మూడు నెలల వరకూ సిట్ అధికారులు చార్జిషీటు దాఖలు చేయకపోవడంతో 90 రోజుల తరువాత ఎర్ర గంగిరెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదల అయ్యారు.

Viveka Murder Case yerra gangireddy bail cancelation plea dismissed
Viveka Murder Case yerra gangireddy bail cancelation plea dismissed

 

ఆ తరువాత ఈ కేసు సిట్ నుండి సీబీఐకి బదిలీ అయిన నేపథ్యంలో వీరి విచారణలో ఎర్ర గంగిరెడ్డిని ప్రధాన నిందితుడుగా తేలింది. తాజాగా ఇదే కేసులో ఆయనను అరెస్టు చేయాలంటే గతంలో ఉన్న బెయిల్ ను రద్దు చేయాలని సీబీఐ..కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణలో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఎర్ర గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సబ్ కోర్టు.. సీబీఐ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో సీబీఐ అధికారులు సబ్ కోర్టు తీర్పును జిల్లా కోర్టు లేదా హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

 

మరో పక్క వివేకా హత్య కేసులో ప్రధాన సూత్రధారులు ఎవరు అనేది తెలుసుకునే పనిలో సీబీఐ అధికారులు కోర్టు అనుమతితో శివశంకరరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా సీబీఐ ముందుకు సాగుతోంది. అయితే మరో పక్క సీబీఐ పైనే ఆరోపణలు చేస్తూ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju