NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Vizag Steel Plant : గంటా రాజీనామా గేమ్ లో బిగ్ ట్విస్ట్..?

Vizag Steel Plant :  ఇప్పుడంటే వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై రోజుకొక వార్త వస్తుంది కానీ అందరికంటే ఈ విషయంపై ముందు స్పందించిన లీడర్ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ టీడీపీ సీనియర్ నేత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. అంతే…. ఒక్క దెబ్బకి అధికార ప్రతిపక్షాలు డిఫెన్స్ లో పడ్డాయి. ఏపీ బిజెపి వారు వెంటనే దీనికి స్పందించి కేంద్రం ఇంకా ప్రకటన చేయలేదు అని చెప్పినప్పటికీ గంటా శ్రీనివాసరావు మాత్రం తన రాజీనామాను స్పీకర్ కు సమర్పించేశాడు. ఆ తర్వాత జగన్ కేంద్రానికి లేఖ రాయడం కేంద్రం పెద్దగా పట్టించుకోకపోవడం కూడా జరిగింది. 

 

Vizag Steel Plant ganta resignation
Vizag Steel Plant ganta resignation

Vizag Steel Plant : ఇదంతా గేమేనా…?

మొత్తానికి గంటా శ్రీనివాసరావు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామా చేసి ఉక్కు కర్మాగారం కోసం తన పదవిని త్యాగం చేసినట్లుగా ప్రకటించారు. ఆతర్వాత నిదానంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, బీజేపీ లీడర్లను కూడా ఈ ఊబిలోకి లాగే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏకంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి అతను నేరుగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇవి చూసి గంటా శ్రీనివాస రావు ఏదో పెద్ద గేమే ఆడుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక ఈ విషయమై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. 

విష్ణు కుమార్ ఏమంటున్నాడంటే

దీనిపై బోలెడు విమర్శలు వచ్చినా ఆయన రాజీనామా కట్టుకథ అని అన్నాఎంతమంది ఎన్నిరకాలుగా మాట్లాడినా గంటా మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి స్పీకర్కు రాజీనామా పంపించారు. అయితే గంట రాజీనామా కేవలం జనాలను మభ్యపెట్టే వ్యవహారమని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. గంటా మొత్తం 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉంటారని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన శ్రీనివాసరావు గారు ఎన్నిసార్లు రాజీనామా చేసినా కూడా అక్కడ ఆమోదం పొందదు అంటూ బాంబు పేల్చాడు. 

అప్పుడే రాజీనామా…?

అయితే గంటా రాజీనామా స్థానిక ఎన్నికల తర్వాత మొదలవుతుందని అప్పుడు ఆయన పార్టీ మారతారని విష్ణుకుమార్ రాజు అంటున్నారు. అంతే కాకుండా నేరుగా వైసీపీలోకి చేరేందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకున్నారని సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ఇక ఇన్ని రోజులు తనకు నచ్చినట్లు జరుగుతున్న గేమ్ లోకి విష్ణుకుమార్ రాజు వచ్చి ఒక్కసారిగా ఇలా సంచలన వ్యాఖ్యలు చేసేసరికి గంటా మళ్లీ స్పందించాల్సి రావచ్చు. మరి దీనిపై గంటా స్పందన ఎలా ఉంటుందో చూడాలి….

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju