NewsOrbit
న్యూస్

వాలంటీర్ సజీవ దహనం!! ఎవరి ఘతూకం

Share

 

 

ఒంగోలు నగరానికి చెందిన ఓ మహిళా వాలంటీరు అందులోనూ వికలాంగులైన యువతిని సజీవదహనం చేయడం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. ఆమె కూర్చున్న మూడు చక్రాల కుర్చీలోనే పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటన తాలూకా లైవ్ విజువల్స్ బయటకు రావడం, యువతి ఆర్తనాదాలు మిన్నంటిన కేకలతో వీడియో భయానకంగా ఉంది.

o

ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణమైన ఒంగోలు నగరం గోపాల్ నగరం కు చెందిన వికలాంగ యువతి భువనేశ్వరి ఉమాదేవి (22). ని మూడు చక్రాల కుర్చీ లో ఇంటి నుంచి తీసుకు వచ్చిన దుండగులు ఒంగోలు నగరంలోని దశరథ రాజు పల్లె శివార్లలో ఉంచి పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో సదరు యువతి మూడు చక్రాల కుర్చీలోనే కూర్చొని సజీవ దహనమైంది. ఆమెను ఇంటి నుంచి కొందరు తీసుకొచ్చి శివార్లలో పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇది ఎవరు ఘాతుకం అనేది ప్రాథమికంగా ఇంకా సాక్షాలు ఏమీ తెలియలేదు. కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. అన్ని కోణాల తో పాటు రాజకీయంగా కూడా ఆమెని ఎవరైనా ఇబ్బంది పెట్టారా ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. వికలాంగ యువతి అందులోనూ మూడు చక్రాల కుర్చీలోనే అత్యంత ఘోరంగా పెట్రోల్ పోసి నిప్పంటించడం శుక్రవారం రాత్రి అన్ని ప్రసార మధ్యమాల్లో ప్రముఖంగా కనిపించింది.


Share

Related posts

చంద్రబాబుకి జగన్ ఓపెన్ పబ్లిక్ డెరింగ్ వార్నింగ్!

CMR

Breaking: మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ కీలక నిర్ణయం ..  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా.. ఎందుకంటే..?

somaraju sharma

Job Notification : కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఖాళీలు

bharani jella