Voter ID: అతి ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ కార్డ్ లలో ఓటు గుర్తింపు కార్డు ఒకటి.. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆన్లైన్ లో సులువుగా ఓటు కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చింది.. తాజాగా ఓటు కార్డులో సులువుగా అడ్రస్ చేంజ్ చేసుకునే విధానాన్ని తీసుకు వచ్చింది.. ఓటర్ కార్డు లో అడ్రస్ చేంజ్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
* ముందుగా ఓటర్ సర్వీస్ పోర్టల్ https://www.nvsp.in/ వెబ్ సైట్ లో మీ వివరాలతో లాగిన్ అవ్వాలి.
* ఇప్పుడు Forms ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో చాలా ఫామ్స్ ఓపెన్ అవుతాయి. అందులో Form 6 పై క్లిక్ చేయాలి..
*ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటు మార్చేందుకు ఓటర్ కార్డు అడ్రస్ మార్చేందుకు కు Form 6 పై క్లిక్ చేయాలి.
* లేదంటే ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మార్చినట్లయితే Form 8A పై క్లిక్ చేయాలి.
*ఇప్పుడు మీ పేరు, పుట్టిన తేది, రాష్ట్రం, నియోజకవర్గం, ప్రస్తుత అడ్రస్, పర్మినెంట్ అడ్రస్ లాంటి వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది.
*తరువాత మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. ఫోటో, అడ్రస్ ప్రూఫ్, వయసు ద్రువీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
* మీ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకునేందుకు హోం పేజీలో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి ఆ తరువాత రిఫరెన్స్ ఐడీని ఎంటర్ చేసి ట్రాక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ దరఖాస్తు స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?